కమ్మని సాంబారులా పళని పాలన

సీఎం కాక ముందే పళనిస్వామికి పెద్దగా అంత క్రేజీ లేదు. కానీ.. ఎప్పుడైతే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి మంచి మార్కులే కొట్టేశారు. జయలలిత ప్రారంభించిన సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను ఆయన మూడున్నరేళ్లలో బాగానే చేశారని ప్రత్యర్థి పార్టీలు సైతం అంగీకరిస్తూనే ఉన్నాయి. జయలలిత, కరుణానిధి హయాంలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపించేవి. అలాగే వ్యక్తిగత విమర్శలు కూడా ఎక్కువగా ఉండేవి. అభివృద్ధి కంటే వారు సంక్షేమంపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు. Also […]

Written By: Srinivas, Updated On : March 18, 2021 10:32 am
Follow us on


సీఎం కాక ముందే పళనిస్వామికి పెద్దగా అంత క్రేజీ లేదు. కానీ.. ఎప్పుడైతే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి మంచి మార్కులే కొట్టేశారు. జయలలిత ప్రారంభించిన సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను ఆయన మూడున్నరేళ్లలో బాగానే చేశారని ప్రత్యర్థి పార్టీలు సైతం అంగీకరిస్తూనే ఉన్నాయి. జయలలిత, కరుణానిధి హయాంలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపించేవి. అలాగే వ్యక్తిగత విమర్శలు కూడా ఎక్కువగా ఉండేవి. అభివృద్ధి కంటే వారు సంక్షేమంపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు.

Also Read: వైసీపీలో ఇప్పుడు గుర్తింపే పెద్ద సమస్య?

పళనిస్వామి తనకు ఇమేజ్ లేకపోయినా ముఖ్యమంత్రిగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారన్నది తమిళనాట విన్పిస్తున్న టాక్. పళనిస్వామి ఊహించని రీతిలో ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత మరణం తర్వాత, శశికళ జైలు పాలయ్యాక అసలు అన్నాడీఎంకే అధికారంలో ఉంటుందని ఎవరూ ఊహించ లేదు. అయితే.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పళనిస్వామి మూడున్నరేళ్లు ప్రభుత్వాన్ని సమర్థ పాలన సాగించారు.

పళనిస్వామి నేతృత్వంలో తమిళనాడులో చాలావరకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మెట్రో వంటి ప్రాజెక్టులకు నిధులను తెచ్చుకోగలిగారు. జలవివాదాలను పరిష్కరించుకోగలిగారు. కీలక కరోనా సమయంలోనూ పళనిస్వామి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని కితాబు ఇస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో గతంలో కంటే పళనిస్వామి పాలనకే ప్రజలు ఎక్కువ మార్కులే వేస్తున్నారు.

Also Read: తెలంగాణ‌లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌంటింగ్.. తీవ్ర ఉత్కంఠ‌!

డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా బలంగా ఉన్నప్పటికీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెదిరిపోకుండా పళని స్వామి చూసుకోగలిగారు. దినకరన్ కొంత ఇబ్బంది పెట్టినా ఉప ఎన్నికల్లో అవసరమైన స్థానాలను సాధించి ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగారు. అయితే.. ఇప్పుడు మరోసారి ఎన్నికల టైమ్‌ వచ్చేసింది. మరి ఈ ఎన్నికల్లో పళనిస్వామి ఏమేరకు సక్సెస్‌ అవుతారోనని అంతటా ఆసక్తికరంగా ఉంది. మరోవైపు.. పళనిస్వామి అంటే ప్రజల్లో సాఫ్ట్‌ కార్నర్‌‌ బాగా ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్