విజయసాయిని దెబ్బకొడితేనే ఆశలు..!

విజయసాయిరెడ్డి.. ఆయనో రాజ్యసభ ఎంపీ. అంతకంటే ఎక్కువ సీఎం జగన్‌కు నమ్మినబంటు. వైసీపీలో ఆయన చెప్పిందే వేదం. ఆయన తర్వాతే ఎవరైనా. పార్టీ తరపున పార్లమెంట్‌లో గళం విప్పాలన్నా ఆయనే. ఇప్పుడు ఆయన విశాఖ ప్రాంతంలో ఉన్నారు. ఆయన అక్కడి వరకే రాజకీయాలు చేస్తున్నారు. జగన్ కూడా విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలను మాత్రమే అప్పగించారు. కానీ.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలకు విజయసాయిరెడ్డి టార్గెట్ అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కంటే విజయసాయిరెడ్డిని తమ ప్రధాన […]

Written By: Srinivas, Updated On : March 18, 2021 1:27 pm
Follow us on


విజయసాయిరెడ్డి.. ఆయనో రాజ్యసభ ఎంపీ. అంతకంటే ఎక్కువ సీఎం జగన్‌కు నమ్మినబంటు. వైసీపీలో ఆయన చెప్పిందే వేదం. ఆయన తర్వాతే ఎవరైనా. పార్టీ తరపున పార్లమెంట్‌లో గళం విప్పాలన్నా ఆయనే. ఇప్పుడు ఆయన విశాఖ ప్రాంతంలో ఉన్నారు. ఆయన అక్కడి వరకే రాజకీయాలు చేస్తున్నారు. జగన్ కూడా విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలను మాత్రమే అప్పగించారు. కానీ.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలకు విజయసాయిరెడ్డి టార్గెట్ అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కంటే విజయసాయిరెడ్డిని తమ ప్రధాన ప్రత్యర్థిగా చూస్తుండటం విశేషం.

Also Read: కమ్మని సాంబారులా పళని పాలన

విజయసాయిరెడ్డి నెల్లూరు వాసి. వైసీపీ అధికారంలోకి రాకముందు కూడా పార్టీలో నెంబరు 2గా ఉన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయసాయరెడ్డికి జగన్ ప్రత్యేకంగా రాజ్యసభకు ఎంపిక చేశారు. ఢిల్లీలో లాబీయింగ్ చేయడానికే విజయసాయిరెడ్డికి రాజ్యసభ పదవిని జగన్ ఇచ్చారు. అయితే.. జగన్ ఇచ్చిన పనిని విజయసాయిరెడ్డి సక్సెస్ ఫుల్‌గానే పూర్తి చేశారు. ఎన్డీఏ నుంచి టీడీపీ తనంతట తాను బయటకు వచ్చేలా చేయడంలోనూ విజయసాయిరెడ్డి సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. అందులో ఆయన పాత్ర లేదని అనుకోలేం.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డికి జగన్ అంతకంటే పెద్దపదవిని ఇచ్చింది లేదు. ఆయనను కేవలం ఉత్తరాంధ్ర రాజకీయాలకే పరిమితం చేశారు. ప్రధానంగా విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించడం వెనక కూడా విజయసాయిరెడ్డి ఆలోచన ఉందని విపక్షాల అనుమానం. ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనూ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయడం, వైసీపీకి ఇబ్బందులు కలగడకుండా ప్రయత్నిస్తుండటం విపక్షాలకు ఇబ్బందిగా మారింది.

Also Read: వైసీపీలో ఇప్పుడు గుర్తింపే పెద్ద సమస్య?

అందుకే.. చంద్రబాబు నుంచి కిందిస్థాయి టీడీపీ నేతల వరకూ విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు జగన్ రాజకీయం విజయసాయి చేతుల్లో ఉందని భావిస్తూ విపక్షాలు ఆయనను టార్గెట్ చేసుకున్నాయి. ముందుగా విజయసాయిరెడ్డిని మానసికంగా దెబ్బతీయగలిగితే సగం విజయం సాధించినట్లేనన్నది విపక్షాల భావన. అందుకే అన్నిరకాల ఆరోపణలు ఆయనపై చేస్తున్నారు. భూ కబ్జాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆయనే కారణంగా చూపుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్