https://oktelugu.com/

‘గ్రేటర్’ గుణపాఠం.. తెరపైకి నిర్బంధ ఓటింగ్..!

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నిన్న సాయంత్రానికి ముగిసింది. గత అసెంబ్లీ.. మున్సిపల్.. పంచాయతీ ఎన్నికలను పకడ్బంధీ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ మాత్రం విఫలమైనట్లు కన్పిస్తోంది. జీహెచ్ఎంసీ పోలింగ్ తగ్గడానికి రాజకీయ పార్టీలతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర ఎంతైనా ఉందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. Also Read: పోలింగ్ శాతం తగ్గడం ఎవరికి లాభం? గ్రేటర్ ఎన్నికల్లో వివాదాస్పద వాఖ్యలు చేసిన నేతలను కట్టడి చేయడంలో ఎన్నికల సంఘం చూసిచూడనట్లు వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 2, 2020 / 02:57 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నిన్న సాయంత్రానికి ముగిసింది. గత అసెంబ్లీ.. మున్సిపల్.. పంచాయతీ ఎన్నికలను పకడ్బంధీ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ మాత్రం విఫలమైనట్లు కన్పిస్తోంది. జీహెచ్ఎంసీ పోలింగ్ తగ్గడానికి రాజకీయ పార్టీలతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర ఎంతైనా ఉందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

    Also Read: పోలింగ్ శాతం తగ్గడం ఎవరికి లాభం?

    గ్రేటర్ ఎన్నికల్లో వివాదాస్పద వాఖ్యలు చేసిన నేతలను కట్టడి చేయడంలో ఎన్నికల సంఘం చూసిచూడనట్లు వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల పకడ్బంధీగా నిర్వహించే ఎన్నికల కమిషన్ పట్టుమని 150 స్థానాలున్న డివిజన్లలో ఎన్నికలు సజావుగా నిర్వహించలేక చతికిలిపడిందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఓటర్ లిస్టును కూడా ఎన్నికల అధికారులు సరిగ్గా నిర్వహించలేదనే విమర్శలున్నాయి.

    2016లో 45.29శాతం పోలింగ్ నమోదుకాగా 2020లో 45.70శాతంగా నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. అయితే సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ శాతం కేవలం 36శాతం ఉండగా చివరి గంటలో మరో 9శాతం నమోదయింది. అయితే చివర్లో అంత పోలింగ్ నమోదవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

    ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీల వైఫల్యం పక్కన పెడితే నగర ఓటర్లలోనూ నిర్లక్ష్యంగా కొట్టిచ్చినట్లు కన్పిస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు.. వికలాంగులు.. మహిళలు ఎక్కువగా కన్పించడం యువత మాత్రం పెద్దగా కన్పించలేదు. ఇక హైదరాబాద్లో ఎక్కవ సంఖ్యలో ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగులంతా ఈ ఎన్నికకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: హాట్ టాపిక్.. జాతీయగీతం మారబోతుందా?

    దాదాపు 80శాతం టెక్కీలు ఈ ఎన్నికల్లో పాల్గొనలేదని తెలుస్తోంది. వరుసగా సెలవులు రావడంతో కొందరు సొంతూళ్లకు వెళ్లగా.. మరికొందరు వర్క్ ఫ్రమ్ హోం కారణంగా ఓటింగ్ లో పాల్గొనలేదని సమాచారం. ప్రైవేట్ ఉద్యోగులకు యాజమాన్యాలు సెలవు ఇవ్వకపోవడంతో వారుసైతం ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదుకావడంతో పలు అంశాలపై చర్చ జరుగుతోంది. ఓటింగులో పాల్గొనని వారికి ప్రభుత్వ పథకాలను వర్తింప చేయద్దని.. ఓటింగ్ వేసేవారికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత. కళాశాలల్లో అడ్మిషన్స్.. ప్రభుత్వ పథకాలను వర్తింప చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. మరోవైపు యువత ఆకట్టుకునేలా ఆన్ లైన్ ఓటింగ్ లేదా నిర్బంధ ఓటింగ్ తీసుకురావాలనే సూచనలు తెరపైకి వస్తున్నాయి.

    అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారత్ లో నిర్బంధ ఓటింగ్ అనేది సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు నేర్పిన గుణపాఠంతో భవిష్యత్తులో ఎన్నికల నిర్వహాణ.. ప్రచారంలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్