Shock To Saireddy: ఎన్నో ఏండ్లుగా నాన్చిన ఏపీ కేబినెట్ మార్పు ఎట్టకేలకు జరిగిపోయింది. అయితే ఈ కూర్పులో అనేక ట్విస్టులు ఉన్నాయి. చివరి నిముషంలో కేబినెట్ కూర్పులో కొన్ని మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. అయితే ఈ సారి మంత్రి పదవుల మార్పులో జగన్ మార్కు చూపించారు. ఆయన వెన్నంటి ఉండే కొందరిని పక్కన పెట్టేసి.. మరి కొందరికి పెద్ద పీట వేశారు. ఇదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

వాస్తవానికి జగన్ మొదటి కేబినెట్ లో సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటి వారు కీలకంగా వ్యవహరించారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేదానిపై వారే స్వయంగా జగన్‌కు కొన్ని సలహాలు ఇచ్చారు. కానీ ఈ సారి మాత్రం బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను జగన్ ఎక్కువగా నమ్మారు. వారి టీమ్‌కు ప్రయారిటీ ఇచ్చినట్టు స్పష్టం అవుతోంది.
అయితే చాలామందికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు.. మిగతా వారికి ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు వచ్చినప్పుడు సామాజిక కారణాలను చూపించినా.. లోతుగా ఆలోచిస్తే మాత్రం బొత్స, పెద్దిరెడ్డి టీమ్ లకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ సారి ప్రకాశం జిల్లా నుంచి బాలినేనికి మత్రి పదవి పక్కా అనే వార్తలు వచ్చాయి. పైగా ఆయన జగన్ కు బంధువు కూడా. కానీ ఆయన సామాజిక వర్గాల ఆధారంగా పదవులు కేటాయించినట్టు చెప్పి.. ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: ముగిసిన ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం.. కాసేపట్లో శాఖల కేటాయింపు..!
ఈ సారి కేబినెట్ మార్పులో సీనియారిటీ అనే అంశాన్ని జగన్ తెరమీదకు తీసుకువచ్చారు. దాంతో ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యానారయణ, రాయల సీమ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను పరిగణలోకి తీసుకున్నారు. వీరిద్దరి అభిప్రాయాల మేరకు మంత్రి పదవులు కట్టబెట్టినట్టు చర్చ సాగుతోంది. వీరిద్దరూ గతంలో కూడా అనేక ఎన్నికల్లో తమ వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేశారు.
అందుకే ఈసారి వారి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు జగన్. 2024ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారిని ముందు ఉంచి మంత్రి పదవుల మార్పు చేశారు. అయితే ఇందులో పీకే టీమ్ ఇచ్చిన కొన్ని సలహాలను కూడా తీసుకున్నారు. చూస్తుంటే ఉత్తరాంధ్రలో సాయిరెడ్డిని బొత్స డామినేట్ చేసినట్టే కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను కూడా బొత్సకే అప్పగించే ఆలోచనలో ఉన్నారు జగన్. అదే జరిగితే సాయిరెడ్డి హవా ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ తగ్గిపోతుంది
Also Read: వికీపీడియాలో హోమంత్రిగా రోజా.. అభిమానుల అత్యుత్సామే కారణమా?
[…] […]