https://oktelugu.com/

Pavan Kalyan: బందరుపై పవన్ భారీ ప్లాన్.. జనసేనలోకి వంగవీటి రాధా

Pavan Kalyan: ఏపీలో మరో వారం రోజుల్లో పొలిటికల్ స్పీడ్ పెరగనుంది. జనసేన పదో ఆవిర్భావ సభ ఇందుకు వేదిక కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తొమ్మిదో ఆవిర్భావ సభ గుంటూరు జిల్లా ఇప్పటంలో నిర్వహించారు. ఎన్నో రాజకీయ ప్రకంపనలకు అది వేదిక అయ్యింది. నాడు సభకు భూములిచ్చారన్న కోపంతో ఇప్పటం గ్రామాన్ని నేలమట్టం చేసేంతలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు. ఇప్పటికీ అక్కడ విధ్వంసం కొనసాగుతునే ఉంది. అయితే దీనికి మాత్రం జనసేన పదో […]

Written By:
  • Dharma
  • , Updated On : March 7, 2023 / 04:44 PM IST
    Follow us on

    Pavan Kalyan: ఏపీలో మరో వారం రోజుల్లో పొలిటికల్ స్పీడ్ పెరగనుంది. జనసేన పదో ఆవిర్భావ సభ ఇందుకు వేదిక కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తొమ్మిదో ఆవిర్భావ సభ గుంటూరు జిల్లా ఇప్పటంలో నిర్వహించారు. ఎన్నో రాజకీయ ప్రకంపనలకు అది వేదిక అయ్యింది. నాడు సభకు భూములిచ్చారన్న కోపంతో ఇప్పటం గ్రామాన్ని నేలమట్టం చేసేంతలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు. ఇప్పటికీ అక్కడ విధ్వంసం కొనసాగుతునే ఉంది. అయితే దీనికి మాత్రం జనసేన పదో ఆవిర్భావ సభే కావడం కారణం. ఎన్నో రాజకీయ ప్రకటనలకు కీలకంగా మారనున్నందున వైసీపీ సర్కారు జనసేన అత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టేలా ఇప్పటంలో విధ్వంసాన్ని కొనసాగిస్తోంది.

    మార్చి 14న మచిలీపట్నంలో జనసేన పదో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 36 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభ నిర్వహించనున్నారు. అయితే స్థల ఎంపిక విషయంలో జనసేన అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ప్రధానంగా మాజీ మంత్రి, పవన్ పై నోరు పారేసుకునే నేతగా పేరున్న పేర్ని నానిని చెక్ చెప్పేందుకేనన్న టాక్ నడుస్తోంది. టీడీపీలో ఉన్న వంగవీటి రాధాక్రిష్ణను తెరపైకి తెచ్చి అటు ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బాలశౌరికి చెక్ చెప్పేందుకు పవన్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మచిలీపట్నంలో సభ నిర్వహించి ఆ ప్రభావం క్రిష్ణ, గుంటూరు, ఇటు గోదావరి జిల్లాలపై ప్రభావం చూపించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

    ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ట టీడీపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన ఆ పార్టీలో చేరారు. చంద్రబాబు మాత్రం రాధాకృష్ణకు టిక్కెట్ ఇవ్వలేదు. కేవలం ప్రచారానికే వాడుకున్నారు. టీడీపీ ఓటమి తరువాత రాధాక్రిష్ణ పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. అలాగని రాజకీయంగా ప్రత్యేకంగా ఏ నియోజకవర్గంపై దృష్టిపెట్టలేదు. కాపు సామాజికవర్గకార్యక్రమాల్లో మాత్రమే యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రాధాను జనసేనలోకి తెచ్చి మచిలీపట్నం ఎంపీగా పోటీచేయించాలని పవన్ భావిస్తున్నారు. అందుకు తగ్గ అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి పదో ఆవిర్భావ దినోత్సవంలో కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.

    మచిలీపట్నం ఎమ్మెల్యేగా పేర్ని నాని, ఎంపీగా బాలశౌరి వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య పొసగడం లేదు. బాగా అంతరం పెరిగింది. ఒకరంటే ఒకరు ఓడించుకునే స్థాయిలో విభేదాలు ఏర్పడ్డాయి. మరోవైపు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పోటీ చేయడం లేదు. పెడన నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో రాధాను జనసేనలో ఆహ్వానించి మచిలీపట్నం నుంచి పోటీచేయిస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని పవన్ భావిస్తున్నారు. రాధా కానీ ఎంపీగా పోటీచేస్తే గుడివాడ, గన్నవరం, పెనమలూరు, పెడన, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లోవైసీపీ కూడా మచిలీపట్నం ఎంపీ సీటును ఆఫర్ చేసింది. కానీ రాధా వ్యతిరేకించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం రాధా ఒప్పుకునే చాన్స్ అధికంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.