
Lokesh: టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది. జనవరి 27న తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర లోకేష్ నడవనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించనున్నారు. టీడీపీని అధికారంలోకి తేవడంతో పాటు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి లోకేష్ తో చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. మరోవైపు పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ను తేవాలన్న డిమాండ్ రావడంతోనే అన్నటాక్ కూడా ఉంది. అయితే ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో అదే హైలెల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నేరుగా లోకేష్ కే అటు పార్టీ శ్రేణులు, యువత ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై లోకేష్ తనదైన శైలిలో రియాక్టవుతున్నారు.

ప్రస్తుతం నందమూరి, నారా కుటుంబాల మధ్య మంచి అనుబంధమే కొనసాగుతోంది. కానీ ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చంద్రబాబు, లోకేష్ లతో కలవడం లేదన్న టాక్ ఉంది. అటు ఎన్టీఆర్ సన్నిహితులుగా చెప్పుకునే కొడాలి నాని, వల్లభనేని వంశీలు సైతం ఎన్టీఆర్ ను కార్నర్ చేసుకొని చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలకు దిగుతుంటారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. అటు జగన్ సర్కారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చింది. కానీ ఈ సందర్భాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందన అంత దూకుడుగా లేదు. కేవలం ఖండించాలన్న కోణంలోనే మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ లతో తనకు గ్యాప్ ఎక్కువగా ఉందని సంకేతాలిచ్చేలా పొడిపొడిగానే మాట్లాడినట్టు ప్రకటనలో ఖండన ఇచ్చారు.
Also Read: Pavan Kalyan: బందరుపై పవన్ భారీ ప్లాన్.. జనసేనలోకి వంగవీటి రాధా
ఈ నేపథ్యంలో సందేహాలను నివృత్తి చేసుకునేందుకు పార్టీ శ్రేణులతో పాటు యువత జూనియర్ ఎన్టీఆర్ ను కార్నర్ చేసుకొని లోకేష్ లపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మొన్న ఆ మధ్యన విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా అంటూ ప్రశ్నించారు. దీనిపై లోకేష్ స్పాంటెనిష్ గా స్పందించారు. వందకు వంద శాతం ఆహ్వానిస్తానంటూ బదులిచ్చారు. సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన ఉన్నవారు తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఎవరైతే రాష్ట్రం అభివృద్ధి చెందాలని భావిస్తున్నారో? ఎవరైతే మార్పును కోరుకుంటున్నారో? అటువంటి వారంతా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని కోరారు.
ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. అయితే దారిపొడవునా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలియడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి. టీడీపీని టేకోవర్ చేసుకొని నడపాలిఅని అర్ధం వచ్చేలా వీటిని ఏర్పాటుచేస్తున్నారు. ఇలా వెలుస్తున్న ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు తొలగిస్తున్నారు. అయితే లోకేష్ ఆగి ప్రసంగిస్తున్న ప్రతీచోట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావనే ఎక్కువ మంది తీసుకొస్తున్నారు. దీనిపై లోకేష్ కూడా ఓపికగానే మాట్లాడుతున్నారు. అందరం టీడీపీలో భాగస్వామ్యేనని చెబుతున్నారు. అందర్నీ పార్లీలోకి పిలుస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమాల్లో బీజీగా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే చాన్సే లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Marriage: 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలివీ