ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో ప్రతిపక్షాలు సైతం పెదవి విరుస్తున్నాయి. అయినా ప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. దీంతో గాంధీ జయంతి సందర్భంగా రేపు జనసేన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని భావించింది. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దవళేశ్వరం, అనంతపురం జిల్లాల్లో పాల్గొనేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కానీ ప్రభుత్వం పవన్ ను అడ్డుకుంటుందని జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరమ్మతు పనులు ఆపేది లేదని జనసేన చెబుతోంది. దీంతో ఏమేరకు ప్రభుత్వం స్పందిస్తుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది.

అయితే పవన్ కల్యాణ్ శ్రమదానం చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ను అదుపులోకి తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసిందని చెబుతున్నారు. పోలీసులను మోహరించి వారి ప్రయత్నాలను అడ్డుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. పోలీసులు అడ్డుకున్నా శ్రమదానం ఆపేది లేదని జనసేన నేతలు చెబుతున్నారు.
దవళేశ్వరం వద్ద అడ్డుకున్నా మరో రోడ్డులో శ్రమదానం చేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ చర్యలను రహస్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన అనవసరంగా రాద్దాంతం చేస్తుందని ప్రతి విమర్శలు చేస్తోంది. వర్షాలు పడుతున్నందున మరమ్మతులు చేయడం కష్టమని భావించి దసరా తరువాత చేసేందుకు టెండర్లు పిలిచినట్లు చెబుతున్నారు. కానీ వాస్తవంగా అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదని తెలుస్తోంది.
ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్న సందర్భంగా ఎక్కడ కూడా తట్టెడు మట్టి పోసంన సందర్భాలు కనిపించలేదు. దీంతో ప్రతిపక్షాలు సైతం గోల చేస్తున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు జనసేన మరమ్మతులు చేయాలని భావించిన నేపథ్యంలో వైసీపీ నేతలు జనసేన ప్రయత్నాలను అడ్డుకునేందుకు భావిస్తోందని తెలుస్తోంది. జనసేన నెల రోజులు గడువు పెట్టినా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే మరమ్మతులు చేయాలని చూస్తోందని చెబుతున్నారు.