ఏపీ పాలిటిక్స్ లో సవాళ్ల పర్వం కొసాగుతోంది. మీరో నేనే తేల్చుకుందా రా అంటూ నిన్న జనసేనాని చేసిన సవాల్ పై మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తన జీవితకాలంలో జగన్ ను ఓడిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు.

వెంగలపూడి సంచివాలయంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు భయం అంటే ఏమిటో చూపిస్తానని పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మేం పవన్ కు ఎందుకు బయపడాలి. ఆయన ప్రసంగాలా.. మేం పట్టించుకోం.. పోనీ జానీ లాంటి ప్లాప్ సినిమాలు తీసి చూపించి బయపెడతాడా అంటే అవీ చూడం. 2024 లోనూ ఆయన గెలుస్తారో లేదో తెలియదు. కొన్ని ఎంపీటీసీ స్థానాలు, రెండు జడ్పీటీసీలు గెలిచి ఏదో సాధించినట్లు హడావుడి చేస్తున్నారు. జగన్ 2014, 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు.
మొన్న 151 స్థానాలు సాధించారు. ఈసారి పవన్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఇంకెవరితో కలిసినా వైసీపీ గెలుస్తుందన్నారు. పవన్ కల్యాణ్ కు, జగన్ కు ఏ రకంగానూ పోలిక లేదని, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. సొంతగా పార్టీ స్థాపించి, పోటీచేసిన రెండు స్థానాల్లోనూ గెలవని నాయకుడు దేశంలో మరెక్కడా లేరని అన్నారు. అలాంటి రికార్డు సాధించిన పవన్ చూసి తామొందుకు బయపడాలని అని నాని ప్రశ్నించారు. అలాగే జగన్ ను ఓడించే సత్తా పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. సోనియాకే జగన్ భయపడలేదు నువ్వో లెక్కా అంటూ ఘాటు కామెంట్లు చేశారు. 2024 లో ఏం చేస్తారో మేమూ చేస్తామన్న కొడాలి ఇంకో జానీ సినిమా చూపించి మమ్మల్ని భయపెడతావా అంటూ ఎద్దేవా చేశారు.