
Pawan Kalyan- ABN RK: నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు మొత్తం చుట్టి వస్తుందని ఒక నానుడి.. ఇప్పుడు దానిని నిజం చేసే పనిలో పడ్డారు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. ఇంకా ఏపీలో ఎన్నికలు రానే రాలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు.. కానీ అప్పుడే ఆయన పొత్తులు తేల్చేశారు.. ఎవరికి ఎంత ప్యాకేజీలు ముడుతున్నాయో చెప్పేశారు. తనకు ఛానల్, ఒక పేపర్, వెనుక 40 ఇయర్స్ ఇండస్ట్రీ సపోర్టు ఉందన్న ధైర్యంతో అడ్డగోలుగా పచ్చ రాతలు రాస్తున్నారు. ఏకంగా పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ వేయికోట్ల ఆఫర్ ప్రకటించాడని తన పేపర్లో రాసుకొచ్చాడు. అంతేకాదు ఈ రాయబారానికి ఏపీలోని కాపు నేతలని పవన్ దగ్గరకు పంపించాడని అడ్డగోలుగా రాశాడు.
మరి ఇదే రాధాకృష్ణ చంద్రబాబు 2018లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి పనిచేద్దామని కెసిఆర్ కు ఆఫర్ ఇచ్చింది నిజం కాదా? దీనికోసం కేసీఆర్ కు చంద్రబాబు ఎంత ఆఫర్ ఇచ్చి ఉంటాడు? రాధాకృష్ణ ఇలాంటివి రాయడు. ఎందుకంటే అతడు ఈయన బాస్ కాబట్టి… ఆయన కళ్ళల్లో నీళ్లు చూడలేడు. ఆయన అధికారం కోల్పోతే తట్టుకోలేడు. రాధాకృష్ణ దృష్టిలో చంద్రబాబు మాత్రమే లోక నాయకుడు. మిగతా వాళ్లంతా జుజుబి.. రాధాకృష్ణ చెప్పినట్టు 1000 కోట్లకు పవన్ కళ్యాణ్ తలవంచాడు అనుకుందాం. దానికి నేరుగా పవన్ కళ్యాణ్ తోనే కేసీఆర్ మాట్లాడవచ్చు కదా.. మధ్యలో ఈ కాపు నాయకుల్ని రాయబారాలకు ఎందుకు పంపినట్టు? ఆల్రెడీ భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ లో 50 స్థానాలు ఎంపిక కొన్నది నిజం అయితే… ఇదే వెయ్యి కోట్లు అక్కడి ప్రజలకు మంచిదే వారే ఓట్లు వేస్తారు కదా! పైగా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ఈ చిన్న లాజిక్ రాధాకృష్ణ ఎలా మర్చిపోయాడు?

ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తొలినాళ్ళల్లో రాధాకృష్ణ ఇలాగే విషం చిమ్మాడు. తన పత్రికలో అడ్డగోలుగా రాసుకుంటూ వచ్చాడు. చిరంజీవి పార్టీ మధ్యలో మునిగిపోతుందని చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేసేవాడు.. తన గురువు చంద్రబాబుకు ఎటువంటి అడ్డంకి రాకుండా ఉండేందుకు ఎంత పెంట చేయాలో అంత చేశాడు. ఇప్పుడు ప్రజల్లో పవన్ కళ్యాణ్ కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక గుడ్డ కాల్చి మీద వేస్తున్నాడు.. కెసిఆర్ వేయికోట్ల ఆఫర్ ఇచ్చాడని అడ్డగోలు రాతలకు దిగుతున్నాడు.. ఇదే చంద్రబాబు కు 2014లో మద్దతు పలికితే ఏం చేశాడో పవన్ కళ్యాణ్ కు గుర్తే ఉంది. రాధాకృష్ణ రాసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ కు ఉన్న చరిష్మా పడిపోదు. 1000 కోట్లు సంపాదించాలి అంటే పవన్ కళ్యాణ్ కు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద లెక్క కాదు. ఆయన చిటిక వేస్తే పెద్దపెద్ద వాళ్లంతా డబ్బులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. కానీ అతను డబ్బు మనిషి కాదు కాబట్టి, డబ్బులు లెక్కపెట్టడు కాబట్టి.. రాధాకృష్ణ లాంటి వారి ఆటలు సాగుతున్నాయి.. ఇదే సమయంలో ఇలాంటి చిల్లర మల్లర ప్రచారాలు మళ్లీ జరగకుండా పవన్ జాగ్రత్త పడాలి. లేకుంటే మొదటికే మోసం వస్తుంది.