
KL Rahul Vice-Captaincy: బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆడిన తొలి రెండు టెస్టుల్లో అద్భుతమైన ప్రతిభ చూపింది. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో చివరి రెండు టెస్టులకు కూడా బీసీసీఐ జట్టును ప్రకటించింది. పాటు ఆస్ట్రేలియా తో ఆడే వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టుల కోసం ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ సెలెక్టర్లు ఇటువంటి ప్రయోగాలు చేయలేదు. అయితే వరుసగా విఫలమవుతున్న రాహుల్ కు అవకాశం ఇవ్వడం గమనార్హం. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు మండిపడుతున్నారు.. ఇదేం నిర్ణయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీసీసీఐ ప్రకటించిన జాబితాలో రాహుల్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించకపోవడం విశేషం. అలాగే అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, కిషన్, జయ దేవ్ కూడా ఈ జట్టులో కొనసాగుతున్నారు. అయితే గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా ను టెస్టులకు ఎంపిక చేయలేదు. తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జుట్టునే మిగతా వాటికి బీసీసీఐ కొనసాగించింది.. ఒకవేళ అదే జట్టును కొనసాగిస్తే మళ్లీ జాబితా ప్రకటించడం ఏంటో బీసీసీఐకే తెలియాలి.
చివరి టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్, కే ఎల్ రాహుల్, గిల్, భరత్, కిషన్, అశ్విన్, అక్షర్, కుల దీప్, జడేజా, షమీ, సిరాజ్, సూర్య, ఉమేష్, జయదేవ్ తో జట్టును ప్రకటించింది.
ఇక టెస్ట్ సీరీస్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. దీనికోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో భరత్ కు చోటు దక్కలేదు. రాహుల్ తిరిగి రావడంతో ఆసీస్ వన్డే సిరీస్ కు అతడిని ఎంపిక చేయలేదు. జడేజా, అక్షర్ జట్టులో చోటు నిలుపుకున్నారు..జయదేవ్ ను కూడా సీరీస్ కు ఎంపిక చేయడం విశేషం.. ఇక మొదటి వన్డే కు రోహిత్ శర్మ దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలవల్ల తొలి వన్డే ఆడటం లేదని తెలుస్తోంది. దీనికి హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని మేనేజ్మెంట్ తెలిపింది.

వన్డే జట్టు: రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రాహుల్, కిషన్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్, అక్షర్, జయదేవ్.
వరుస అవకాశాలు ఇస్తున్నప్పటికీ..
రాహుల్ కు అటు మేనేజ్మెంట్,ఇటు కెప్టెన్ వరుస అవకాశాలు ఇస్తున్నప్పటికీ అతడు వినియోగించుకోలేకపోతున్నాడు.. ఓపెనర్ గా రాణించలేకపోతున్నాడు.. రెండో టెస్టు ముగిసిన అనంతరం వెంకటేష్ ప్రసాద్, ఆకాష్ చోప్రా మధ్య ఇతనికి సంబంధించి సంవాదం జరిగింది. తన టాప్ టెన్ ఓపెనర్లలో రాహుల్ చోటు దక్కించుకోలేడని వెంకటేష్ ప్రసాద్ వ్యాఖ్యానించగా, దానికి ఆకాష్ చోప్రా అభ్యంతరం తెలిపాడు. మనం కూడా అలాంటి సంధి దశను ఎదుర్కొన్నామని.. ఇలాంటి స్థితిలో అలా వ్యాఖ్యానించడం సరికాదని చెప్పాడు. అంతేకాదు రాహుల్ కూడా తన బ్యాటింగ్ శైలి మార్చుకోవాలని హితవు పలికాడు. మరోవైపు వైస్ కెప్టెన్సీ తీసివేయడంతో… రాహుల్ సరిగ్గా ఆడకుంటే ఇంటికి పంపిస్తారనే టాక్ జట్టులో నడుస్తోంది.. మరి దీనిపై మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
🚨 India squads for last two Tests of Border-Gavaskar Trophy and ODI series announced 🚨#TeamIndia | #INDvAUS | @mastercardindia
— BCCI (@BCCI) February 19, 2023