ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. ప్రతి మూడు నెలలకు చేతికి రూ.10 వేలు..?

దేశీయ బీమా కంపెనీగా పేరును సంపాదించుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎల్‌ఐసీ ఎన్నో మనీ బ్యాక్, పెన్షన్ ప్లాన్లను అందిస్తుండగా ఈ పాలసీలను తీసుకోవడం వల్ల ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి. ఎల్‌ఐసీ కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న పాలసీలలో ఎల్‌ఐసీ జీవన్ శాంతి కూడా ఒకటి. నాన్ లింక్డ్ స్కీమ్ అయిన ఈ పాలసీ ద్వారా ప్రతి నెలా డబ్బులు పొందవచ్చు. ఒకేసారి […]

Written By: Navya, Updated On : May 15, 2021 11:43 am
Follow us on

దేశీయ బీమా కంపెనీగా పేరును సంపాదించుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎల్‌ఐసీ ఎన్నో మనీ బ్యాక్, పెన్షన్ ప్లాన్లను అందిస్తుండగా ఈ పాలసీలను తీసుకోవడం వల్ల ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి. ఎల్‌ఐసీ కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న పాలసీలలో ఎల్‌ఐసీ జీవన్ శాంతి కూడా ఒకటి. నాన్ లింక్డ్ స్కీమ్ అయిన ఈ పాలసీ ద్వారా ప్రతి నెలా డబ్బులు పొందవచ్చు.

ఒకేసారి ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. పెన్షన్ తీసుకోవాలని అనుకునే వాళ్లు పాలసీ తీసుకునే సమయంలోనే పెన్షన్ ఎప్పటినుంచి తీసుకుంటారనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. 30 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఒకేసారి ఐదు లక్షలు చెల్లించి 40 ఏళ్ల నుంచి పెన్షన్ పొందాలని అనుకుంటే మూడు నెలలకు రూ.10 వేలు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

30 సంవత్సరాల వయస్సు నుంచి 79 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పెన్షన్ స్కీమ్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఏడాది నుంచి 20 ఏళ్లలోపు ఎప్పుడైనా ఈ పెన్షన్ స్కీమ్ ను ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎంచుకునే ఆప్షన్ ప్రాతిపదికన పెన్షన్ ను పొందే అవకాశం ఉండగా పాలసీదారుడు మరణిస్తే నామినీ బీమా మొత్తం పొందే అవకాశం ఉంటుంది.

జీవించి ఉన్నంత కాలం పెన్షన్ పొందే అవకాశం ఉండటంతో పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలను ఎల్‌ఐసీ అందిస్తుండగా పెన్షన్ పొందాలని అనుకునే వాళ్లు ఈ పాలసీని తీసుకుంటే మంచిది.