ఇది పవన్ వ్యక్తిత్వం అనుకోవచ్చా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాలలో రాజకీయాలకు అతీతంగా ప్రవర్తిస్తారు. ఇటీవల “కాపు నేస్తం” పై జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. 13 నెలల వ్యవధిలోనే 23లక్షలమంది కాపులకు 4,770కోట్లు ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. 2వేల కోట్లు ఇస్తామని చెప్పిన మీరు “ఏడాది తిరిగేలోగా దానికి రెట్టింపు కంటే ఎక్కువ ఇవ్వడం వల్ల కాపు రిజర్వేషన్ అంశం పక్కకు పోతుందని పవన్ మండిపడ్డారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ సీఎం జగన్ జూలై […]

Written By: Neelambaram, Updated On : August 3, 2020 1:13 pm
Follow us on

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాలలో రాజకీయాలకు అతీతంగా ప్రవర్తిస్తారు. ఇటీవల “కాపు నేస్తం” పై జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. 13 నెలల వ్యవధిలోనే 23లక్షలమంది కాపులకు 4,770కోట్లు ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. 2వేల కోట్లు ఇస్తామని చెప్పిన మీరు “ఏడాది తిరిగేలోగా దానికి రెట్టింపు కంటే ఎక్కువ ఇవ్వడం వల్ల కాపు రిజర్వేషన్ అంశం పక్కకు పోతుందని పవన్ మండిపడ్డారు.

ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ సీఎం జగన్ జూలై 1న 1088 అత్యాధునిక అంబులెన్స్ లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించే అంబులెన్సులను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ప్రారంభించడం అభినందనీయం అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ విధంగా సీఎం జగన్ చేసే మంచి పనులను మెచ్చుకుంటునే.. మరోవైపు ప్రజలకు అన్యాయం జరిగే నిర్ణయాలు తీసుకుంటే అదే స్థాయిలో విరుచుకుపడటం పవన్ నైజం. అంటే మంచిని మంచిగా చెడుగా చూడటం పవన్ వైఖరిగా కనిపిస్తోంది. ఇలాంటి మనస్తత్వం రాజకీయాలలో అరుదుగా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.