కరోనా ప్రవాహంలో కూడా.. ఓ హాస్య గుళిక !

కరోనా తీవ్రత ప్రవాహంలో ప్రపంచం కొట్టుకుపోతూ ఉంటే.. మరోపక్క కరోనా పై కూడా జోక్స్ పుట్టిస్తున్నారు మన కామెడీ క్రియేటర్స్. జంధ్యాల లాంటి కామెడీ కింగ్ లేకపోయినా.. పేరడీ చేసే నాలాంటి అధముల ముష్టి హాస్యంతో కరోనా కష్టకాలంలో కూడా హాయిగా నవ్వుకోవచ్చు. తాజాగా ఒక ఇంట్రస్టింగ్ కామెడీ పోస్ట్ ఏమిటంటే.. ఇంట్లోనే కోవిడ్ కు సులభమైన పరీక్ష ఒకటి ఉంది. ప్రతీ రోజు రాత్రి 7 గంటలకు విస్కీ బాటిల్ మూత తీసి, గట్టిగా పీల్చి […]

Written By: admin, Updated On : July 4, 2020 9:26 am
Follow us on


కరోనా తీవ్రత ప్రవాహంలో ప్రపంచం కొట్టుకుపోతూ ఉంటే.. మరోపక్క కరోనా పై కూడా జోక్స్ పుట్టిస్తున్నారు మన కామెడీ క్రియేటర్స్. జంధ్యాల లాంటి కామెడీ కింగ్ లేకపోయినా.. పేరడీ చేసే నాలాంటి అధముల ముష్టి హాస్యంతో కరోనా కష్టకాలంలో కూడా హాయిగా నవ్వుకోవచ్చు. తాజాగా ఒక ఇంట్రస్టింగ్ కామెడీ పోస్ట్ ఏమిటంటే.. ఇంట్లోనే కోవిడ్ కు సులభమైన పరీక్ష ఒకటి ఉంది. ప్రతీ రోజు రాత్రి 7 గంటలకు విస్కీ బాటిల్ మూత తీసి, గట్టిగా పీల్చి వాసన చూసి కళ్ళు మూసుకోండి. మీకు విస్కీ వాసన తెలిస్తే, మీ ముక్కు బాగా పనిచేస్తుంది కాబట్టి, మీకు కరోనా మొదటి పరీక్ష అయిపోయినట్టేనట. అంటే మీకు కొరోనా సోకలేదన్న మాట.

హైదరాబాద్ అంటే ఎందుకంత నిర్లక్యం!

కానీ, మరోసారి పరీక్షించడం, సెకండ్ ఒపీనియన్, ఎందుకైనా మంచిది కదా, కాబట్టి… అదే విస్కీని గ్లాసులో పోసుకుని నాలికతో, మెల్లమెల్లగా చప్పరించి చూడండి. మీకు విస్కీ రుచి తెలిస్తే, ఖచ్చితంగా మీకు కొరోనా రానట్టే అని తీర్మానం చేసుకోవచ్చు. ఎందుకైనా మంచిది 180 యం. యల్ వరకు ఈ పరీక్ష కొనసాగిస్తూ, చప్పరిస్తూ ఉండటం ఉత్తమమండోయ్. మధ్యలో అప్పుడప్పుడు పల్లిలో, కాజూనో తిన్నా కూడా విస్కీ రుచిలో ఏం తేడా తెలియలేదంటే, ఇక ఈ రోజుకి మీకు కొరోనా ఖచ్చితంగా రానట్టే అని ఫిక్స్ అయిపోవచ్చు. ఏమైనా ఈ కష్టకాలంలో, ఏ రోజుకారోజు పరీక్షించుకోవడం చాలా ముఖ్యమండోయ్.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఎందుకైనా మంచిది మీ భార్య పర్మిషన్ తోనే, ఈ టెస్టులు చేయవలెనని ముందు జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. లేనిచో కరోనా వలన కాక మరొక రకంగా స్వర్గస్తులయ్యే అవకాశాలు బహు అధికం అని మీకు తెలియంది కాదు. భారత్‌ లో కరోనా రోజురోజుకు పెరుగుతూనే ఉంది, కాబట్టి.. కరోనాకి మన బ్యాచిలర్ కుర్రాళ్లు వండుకున్న వంటకం గాని, లేదా మన డైలీ తెలుగు ప్లాప్ సీరియల్స్ లోని ఎమోషన్ ను గాని పదే పదే చూపించాలి. చివరగా మీకు నవ్వు రాకపోయినా ఇంతటితో నేను ముగించడం మంచింది.