డ్యాన్సర్ నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి సాయి పల్లవి. దక్షిణాదిలో ఇప్పుడామెకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందం లేకపోయినా.. అభినయంతో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటుందామె. బోల్డ్ క్యారెక్టర్లకు, స్కిన్ షోకు ఎప్పుడూ దూరంగా ఉండే సాయి పల్లవికి సామాజిక స్పృహ కూడా ఎక్కువే. మెడిసిన్ చదివిన ఆమె మనుషులు, మానవ సంబంధాలకు ఎక్కువ విలువనిస్తుంది. మహిళలు, చిన్నారులపై జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది.
హైదరాబాద్ అంటే ఎందుకంత నిర్లక్యం!
ఈ క్రమంలో తమిళనాడులో సంచలనంగా మారిన ఏడేళ్ల చిన్నారి జయప్రియ అత్యాచారం, హత్యపై ఆమె భావోద్వేగానికి గురైంది. తమిళనాడు పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామంకి చెందిన రెండో తరగతి బాలిక జయప్రియ ను కొందరు కామాందులు అత్యాచారం చేసి హత్య చేశారు. చిన్నారి మృత దేహాన్ని ముల్లపొదల్లో పడేశారు. ఈ వార్త తెలిసిన తర్వాత తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ జస్టిస్ ఫర్ జయప్రియ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఈ అమానవీయ ఘటనపై సాయి పల్లవి స్పందించింది. ట్వీట్టర్లో వరుసగా పోస్టులు చేసింది.
ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?
‘మానవ జాతిపై విశ్వాసం వేగంగా నశిస్తుంది. తోడు లేని వారికి సహాయపడటానికి ఇచ్చిన శక్తిని మనం దుర్వినియోగం చేస్తున్నాం. బలహీనులను కాపాడటానికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాము. ఎవరు బలహీనంగా కనిపిస్తే వారిని బాధపెడుతున్నాం. మనలోని క్రూరత్వాన్ని సంతృప్తి పరచడానికి పిల్లలను చంపుతున్నాం. ఇలాంటి ఘటనలు చూస్తూ దారుణమైన జీవితాన్ని గడిపేకంటే మానవజాతి అంతం అవడం ఉత్తమం అని ప్రకృతి మనకు సందేశం ఇస్తోంది. ఈ అమానవీయ ప్రపంచానికి మరొక బిడ్డకు జన్మనిచ్చే అర్హత లేదు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం ద్వారా ఒక నేరం వెలుగులోకి వచ్చిన తర్వాతే న్యాయం జరిగే రోజు రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పటిదాకా గుర్తించబడని, వెలుగులోకి రాని నేరాల పరిస్థితి ఏంటి?. ఇప్పుడు ఎన్నో దారుణమైన నేరాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని గుర్తించేందుకు మనం హ్యాష్ట్యాగ్ వాడే పరిస్థితి వచ్చింది’ అని ఆవేదన వ్యక్తం చేసిన పల్లవి జస్టిస్ ఫర్ జయప్రియ అనే హ్యాష్ట్యాగ్ జతజేసింది.