Pawan vs Jagan : జగన్‌ ను ఆధారాలతో సహా ఇరుకునపెట్టిన పవన్‌ కళ్యాణ్.. లేఖ సంచలనం

Pawan vs Jagan : ప్రజల సంక్షేమమే తనకి ముఖ్యమని… పథకాలు పెట్టి ప్రజల్ని ఉద్ధరిస్తున్నానని ప్రతి మీటింగ్‌లో జగన్‌ అన్నాయ్‌ మైక్‌లో ఊదుతుంటారు. బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతలా తమ మేనిఫెస్టో అని అంటారు. ప్రజలకు తాము ఓట్ల కోసమే ఈ పథకాలు ఇస్తున్నామని డైరెక్ట్‌గా చెప్పకుండా… ఇండైరెక్ట్‌గా గడపకు పంపించి మరీ ఎమ్మెల్యేలతో వచ్చే ఎన్నికలకు ఓటు అడక్కుంటున్నాడు జగన్‌. ప్రతి పథకం ఈ మధ్య కోతలు వేస్తూ.. ప్రజలకు వాతలు పెడుతున్నాడు. అమ్మఒడి నుంచి […]

Written By: NARESH, Updated On : December 28, 2022 10:14 pm
Follow us on

Pawan vs Jagan : ప్రజల సంక్షేమమే తనకి ముఖ్యమని… పథకాలు పెట్టి ప్రజల్ని ఉద్ధరిస్తున్నానని ప్రతి మీటింగ్‌లో జగన్‌ అన్నాయ్‌ మైక్‌లో ఊదుతుంటారు. బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతలా తమ మేనిఫెస్టో అని అంటారు. ప్రజలకు తాము ఓట్ల కోసమే ఈ పథకాలు ఇస్తున్నామని డైరెక్ట్‌గా చెప్పకుండా… ఇండైరెక్ట్‌గా గడపకు పంపించి మరీ ఎమ్మెల్యేలతో వచ్చే ఎన్నికలకు ఓటు అడక్కుంటున్నాడు జగన్‌. ప్రతి పథకం ఈ మధ్య కోతలు వేస్తూ.. ప్రజలకు వాతలు పెడుతున్నాడు. అమ్మఒడి నుంచి అవ్వా,తాతకు ఇచ్చే పింఛన్‌ వరకు కోతలే కోతలు. పింఛన్ల తొలగింపుపై జగన్‌ అన్నాయ్‌కి లేఖ రాసి మరీ… పవర్‌ స్టార్‌ పరువు తీశారు. అసలా లేఖలో ఏముందో చూద్దాం.

‘‘వైసీపీ సర్కారు చెప్పేదొకటి చేసేదొకటి. ముందు నుంచి వారి పాలసీ అదే మరీ. కూల్చటం తప్ప… కట్టడం రాదు. విధ్వంసం, విధ్వేశం తప్ప మరొకటి తెలీదు. మెుదట పథకాలు పెట్టి పజల్ని ఊరించి ఆ తర్వాత కోతలు ప్రారంభించారు. పథకాలకు ఇచ్చే డబ్బుని పూడ్చుకునేందుకు పన్నులే పన్నులు వేస్తూనే ఉన్నారు. ఆకరికి చెత్తపైనా పన్నేసి చెత్త ప్రభుత్వంగా ప్రజల్లో పేరు తెచ్చుకుంది. వాస్తవానికి పథకాలు పెట్టి… వైసీపీ నాయకుల అవినీతికి తూములు తెరిచారు జగన్‌. దోచుకో, దాచుకో అనేలా వైసీపీ ప్రభుత్వం తయారైంది. డ్వాక్రా మహిళల కోసం పెట్టిన పథకం నుంచి అన్నీ పథకాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అభం, శుభం ఎరుగని ముసిలివాళ్లపై తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు జగన్‌. రకరకాల కారణాలు చెప్పి తొలగింంచేందుకు సిద్ధమయ్యారు. చాలా చోట్ల తొలగించేశారు. స్వయంగా ఆ పార్టీ నాయకులే జగన్‌ నిర్ణయాన్ని చూసి నోరెళ్లబెట్టేస్తున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా ఆశ్చర్యాన్ని గురయ్యారు. ’’అంటూ లేఖలో వైసీపీ సర్కార్ చేతకానితనాన్ని ప్రశ్నించారు.

జగన్‌ అండ్‌ కో అవినీతిపై పవన్‌ మాట్లాడే ప్రతిమాట పవర్‌ పుల్‌గా ఉంటుంది. వైసీపీ బ్యాచ్‌లోని ఎవడి గురించి నోరు తెరిచినా.. ఆధారాలతో ఉతికారేస్తారు. అందుకే పవన్‌ తమ ప్రాంతానికి వస్తే తమ అవినీతి గురించి ఎక్కడ మాట్లాడుతారోనని, స్థానిక ఎమ్మెల్యేలకి భయం కూడా పట్టుకుందట.

తాజాగా పింఛన్ల తొలగింపుపై ఏకంగా జగన్‌కే… పవన్‌ బాణం వదిలారు. జగన్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 4 లక్షల మందికి పెన్షన్లను ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నిస్తూ.. నోటీసులు ఇస్తారా అని నిలదీశారు. పింఛన్లను తొలగించడానికి కారణాలు సహేతుకంగా లేవన్న ఆయన.. జగన్‌కు రాసిన లేఖలో పెన్షన్లు తొలగించిన వారి వివరాలను పేర్కొన్నారు పవన్ . అవ్వా, తాతలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తామన్న మీ హామీ ఇలా అమలు చేస్తారా అని ప్రశ్నించారు. పింఛన్లపై లేఖని ఎక్కుబెట్టిన పవన్‌ దెబ్బకి.. వైసీపీ ఇరకాటంలో పడ్డటైంది.