https://oktelugu.com/

Unstoppable With NBK – Prabhas : ‘నా తలరాత బాగాలేదు సార్.. ఈ జన్మకి ఇంతే’ అంటూ బాలయ్య తో చెప్పుకొని బాధపడ్డ ప్రభాస్

Unstoppable With NBK – Prabhas :  ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ ఎల్లుండి టెలికాస్ట్ అవ్వబోతోంది.. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి ప్రోమో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉండగా, రెండవ ప్రోమో ని అభిమానుల కోసం ఈరోజు కాసేపటి క్రితమే విడుదల చేశారు..ఈ ప్రోమో లో ప్రభాస్ బాలయ్య బాబుతో చేసిన సరదా చిట్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ముందుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 28, 2022 / 09:53 PM IST
    Follow us on

    Unstoppable With NBK – Prabhas :  ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ ఎల్లుండి టెలికాస్ట్ అవ్వబోతోంది.. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి ప్రోమో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉండగా, రెండవ ప్రోమో ని అభిమానుల కోసం ఈరోజు కాసేపటి క్రితమే విడుదల చేశారు..ఈ ప్రోమో లో ప్రభాస్ బాలయ్య బాబుతో చేసిన సరదా చిట్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    ముందుగా బాలయ్య మాట్లాడుతూ ‘మగవాళ్లందరూ నిన్ను డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తారు కదా.. మరి గర్ల్ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు’ అని అడుగుతాడు..అప్పుడు ప్రభాస్ దానికి సమాధానం చెప్తూ ‘ఈమధ్య అదేదో టాబ్లెట్ వేసుకున్న సార్..అన్నీ మర్చిపోతున్నాను’ అని అంటాడు..ఇక ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియా లో ఎన్నెన్నో వార్తలు వచ్చాయి..గాసిప్ రాయుళ్లు అయితే టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరి హీరోయిన్లతో ప్రభాస్ కి పెళ్లి చేసేసారు..కానీ ప్రభాస్ కి మాత్రం ఇప్పటి వరకు పెళ్లి కాలేదు.

    ఇదే ప్రస్తావన ని బాలయ్య ప్రభాస్ ముందుకి తీసుకొస్తూ ‘అసలు ఏంటి ప్రభాస్..నీకు పెళ్లి ఉందా లేదా’ అని అడుగుతాడు.. అప్పుడు ప్రభాస్ దానికి సమాధానం చెప్తూ ‘నాకు తల రాత రాసిపెట్టి లేదు సార్..ఏమి చేస్తాం’ అని చెప్తాడు..అప్పుడు బాలయ్య ‘మీ అమ్మకి చెప్పేవి నాకు చెప్తావు ఏంటయ్యా’ అని అంటాడు.

    అప్పుడు ప్రభాస్ గట్టిగా నవ్వేస్తాడు.. ఆ వీడియో మీరు క్రింద చూడవచ్చు..అంతే కాకుండా ఇదే ఎపిసోడ్ లో ప్రభాస్ రామ్ చరణ్ కి కాల్ చెయ్యగా,ఆయన ప్రభాస్ పెళ్ళికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్నీ లీక్ చేస్తాడు..ఇంతకీ ఆ లీక్ ఏంటో తెలియాలంటే ఎల్లుండి వరకు వేచి చూడాల్సిందే..అలా పూర్తి స్థాయి వినోదం తో నిండిపోయిన ఈ ఎపిసోడ్ ని ఎల్లుండి నుండి మీరు ఆహా మీడియా లో చూడొచ్చు.