MS Dhoni: విరాట్ కోహ్లీ దూకుడు.. రవిశాస్త్రి ఆత్మవిశ్వాసం.. ‘మిస్టర్ కూల్’ ఎంఎస్ ధోనీ.. ఈ ముగ్గురి కలయికలో టీమ్ ఇండియా టీ-20 ప్రపంచకప్ కు వెళ్లబోతోంది. కోహ్లీ నేతృత్వంలో భారత్ తొలి ప్రపంచకప్ నెగ్గేందుకు ఇదే మంచి సమయం. అయితే.. ధోనీని మెంటార్ గా ఎందుకు తీసుకున్నారు? అంత అవసరం ఏముంది అనే ప్రశ్నలు కూడా ఎన్నో వచ్చాయి. ధోనీని మెంటార్ గా తీసుకోవడం వెనుక పెద్ద రాజకీయమే జరిగినట్లు తెలుస్తోంది.

వరల్డ్ కప్ కు.. భారత మెంటార్గా మహేంద్ర సింగ్ ధోనీ నియామకంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రత్యక్షంగానే దీనిపై కామెంట్స్ చేశాడు. టీమిండియాకు అసలు మెంటారే అవసరం లేదని.. ధోనీని ఎందుకు తీసుకున్నారో అర్థం కావడంలేదని చెప్పాడు. అయితే క్రీడా విశ్లేషకులు మాత్రం మెంటార్ గా ధోనీని తీసుకోవడం వందశాతం మంచి నిర్ణయమే అంటున్నారు. దూకుడైన కెప్టెన్గా పేరున్న విరాట్ కోహ్లీకి.. మిస్టర్ కూల్ ధోనీ కలిస్తే.. వీరిద్దరికీ సక్సెస్ఫుల్ కెప్టెన్ రవిశాస్త్రి తోడైతే.. టీమ్ ఇండియా వరల్డ్ నెగ్గేందుకు ఇంతకంటే మంచి సమయం దొరకదని చెబుతున్నారు.
ధోనీని మెంటార్ గా నియమించడం వెనుక పెద్ద రాజకీయమే జరిగినట్లు తెలుస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి నుంచే ఈ నిర్ణయం పుట్టుకొచ్చినట్లు సమాచారం. అప్పటి నుంచే టీమిండియాలో విభేదాలు తెరమీదకు వచ్చాయి. తొలి ఇన్నింగ్‌లో 217, రెండో ఇన్నింగ్‌లో 170 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది కివీస్ టీమ్. ఈ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో చిన్నపాటి యుద్ధమే జరిగిందట!
కోహ్లీ నిర్ణయాలు, వైఫల్యాలను తీవ్రంగా తప్పుబట్టారట సీనియర్లు. ఘోర వైఫల్యాని విరాట్ తీరే కారణమని ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐ సెక్రెటరీ జయ్ షాకు వివరించారని తెలిసింది. రవిచంద్రన్ అశ్విన్, చేతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె బీసీసీఐ కార్యదర్శిని కలిశారని సమాచారం. కోహ్లీ తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారట. అయితే.. ఈ విషయాన్ని బీసీసీఐ తోసి పుచ్చింది. టీమిండియా ఐక్యతకు మారుపేరని.. అటువంటిదేం లేదని జయ్ షా తెలిపారు.
బీసీసీఐ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని.. ధోనీని పిలిపించారని సమాచారం. జట్టులోని విభేదాలు, మనస్పర్థల ప్రభావం జట్టు విజయాలపై పడకుండా ఉండేదుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధోనీని మెంటార్ గా నియమించడానికి ఆ డ్రెస్ రూంలోలో వారే కారణమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది.