పవన్ కళ్యాణ్.. ఇక సినీ ఫంక్షన్లకు వెళ్లడా..?

పవన్ కల్యాణ్ ఇటీవల ఓ సినీ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా వివాదం కావడంతో ఏపీ వైసీపీ నాయకులు పవన్ పై విరుచుకుపడ్డారు. మరో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి కొంచెం ఎక్కువగానే మాట్లాడారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత పవన్ కూడా మీడియా సమావేశం నిర్వహించి పరుష వ్యాఖ్యలు సంధించారు. అయితే సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలు […]

Written By: NARESH, Updated On : October 1, 2021 9:47 am
Follow us on

పవన్ కల్యాణ్ ఇటీవల ఓ సినీ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా వివాదం కావడంతో ఏపీ వైసీపీ నాయకులు పవన్ పై విరుచుకుపడ్డారు. మరో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి కొంచెం ఎక్కువగానే మాట్లాడారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత పవన్ కూడా మీడియా సమావేశం నిర్వహించి పరుష వ్యాఖ్యలు సంధించారు. అయితే సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలు ప్రస్తావించడంతో అవి రాజకీయంగా వివాదమయ్యాయి. దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ విషయంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఒకానొక దశలో పవన్ మరోసారి సినీ ఫంక్షన్లో కనిపిస్తాడా..? అన్న చర్చ కూడా హాట్ హాట్ గా సాగుతోంది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ఫ్రీ రిలీజ్ వేడుకకు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా పవన్ సినిమా గురించి మాట్లాడారు. ఆ తరువాత సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించారు. కొందరు నిర్మాతలు తాము పడుతున్న బాధలను తమదగ్గరికొచ్చి చెప్పుకుంటున్నారని, ఏపీ ప్రభుత్వం సినీ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. అయితే ఆ తరువాత రాజకీయంగా కొన్ని పరుష వ్యాఖ్యలను పవన్ చేశారు. వైసీపీ నేతలను టార్గెట్ చేసుకొని పవన్ మాట్లాడడంతో ఆ పార్టీకి చెందిన వారు రెస్పాన్ష్ అయ్యారు.

అయితే మరో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి హైదరాబాద్ లో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించిన పవన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. తమకు అసభ్యకరంగా మెజేజ్లు వస్తున్నాయని, అందుకు పవన్, పవన్ ఫ్యాన్సే కారణమని అన్నారు. అయితే పోసాని సమావేశం నిర్వహిస్తుండగానే కొందరు పవన్ ఫ్యాన్స్ సమావేశం నిర్వహించే ప్రదేశానికి వెళ్లారు. కానీ పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇక ఆ తరువాత పవన్ తరుపును పోసానిపై విమర్శలు చేశారు.

పవన్ సోదరుడు నాగబాబు నేరుగా కాకుండా మీమ్స్ వీడయోస్ ద్వారా వైసీపీ నేతలు, పోసానిపై విమర్శలు చేశారు. ఇక పవన్ మరుసటి రోజు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. ఇలా ఏపీలో పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారిపోయింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రభుత్వానికి చెప్పే తరుణంలో వ్యక్తిగతంగా విమర్శలు చేయడం పెద్ద దుమారంగా మారింది.దీంతో సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

అయితే దిల్ రాజు వంటి నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి తాము ఏపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు పవన్ తప్ప మరెవరూ ప్రస్తావించకపోవడం చూస్తే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఏ వేదికపైకి వచ్చినా ఆవేశంతో రాజకీయంగా మాట్లాడుతారని కొందరు భావిస్తున్నారు. ఈ తరుణంలో పవన్ ను ముఖ్య అతిథిగా పిలిచేందుకు భయపడుతున్నారా..? అన్న చర్చ సాగుతోంది.ఎందుకంటే పవన్ వేదికపై ప్రభుత్వాలపై విమర్శలు చేయడం వల్ల లేని పోని సమస్యలు తెచ్చుకున్నట్లవుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి పవన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం వల్ల తమ సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ అవుతుందని భావించిన కొందరు ఇక నుంచి పవన్ ను పిలిస్తే సమస్యలు వస్తాయని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో పవన్ కు మద్దతు ఇచ్చేవాళ్లు లేకపోలేదు. పరిశ్రమలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన సమస్యలను చెప్పడానికి పవన్ లాంటి వ్యక్తి ఇండాలని భావించిన వారూ ఉన్నారు.