https://oktelugu.com/

pawan kalyan yatra for farmers : జనంలోకి జనసేనాని: రైతు ఓదార్పు యాత్రలో పవన్ కళ్యాణ్

pawan kalyan yatra for farmers : జనసేనాని జనంలోకి వస్తున్నారు. రైతుల కోసం కదిలి వస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కోసం పరామర్శకు బయలు దేరారు. ఆంధ్రప్రదేశ్ లో రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల కోసం పరామర్శ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసే గొప్ప క్రతువును పవన్ కళ్యాన్ చేపట్టారు. పోరాటాలే […]

Written By:
  • NARESH
  • , Updated On : April 2, 2022 9:27 pm
    Follow us on

    pawan kalyan yatra for farmers : జనసేనాని జనంలోకి వస్తున్నారు. రైతుల కోసం కదిలి వస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కోసం పరామర్శకు బయలు దేరారు. ఆంధ్రప్రదేశ్ లో రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల కోసం పరామర్శ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

    ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసే గొప్ప క్రతువును పవన్ కళ్యాన్ చేపట్టారు. పోరాటాలే కాకుండా వారి దీనగాథను ప్రభుత్వానికి, ప్రజలకు తెలుపాలని డిసైడ్ అయ్యారు.

    ఇటీవల రైతు సమస్యల గురించి పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులు తీసుకెళ్లారు. పార్టీ నాయకత్వం దీనిపై పవన్ కు సూచించింది. పంట నష్టాలతో రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ శ్రేణులు సేకరించిన సమాచారం మేరకు గోదావరి జిల్లాల్లోనే ఏకంగా 73మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసి పవన్ కరిగిపోయారు. వారందరినీ ఆదుకోవాలని నిర్ణయించారు.

    సాగును నమ్ముకున్న రైతుల పరిస్థితి దీనంగా ఉందని.. కొంతైనా ఊరట కలిగేలా వారికి జనసేన పక్షాన ఆర్థిక సాయం అందించాలని పవన్ నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. ఈ సాయంతో రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు కొంతైనా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు.

    త్వరలోనే ప్రతీ రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ బయలుదేరుతున్నారు. ఈ రైతులకు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని.. వారికి ఇప్పటివరకూ రూపాయి కూడా ప్రభుత్వ సాయం అందలేదని పవన్ పేర్కొన్నారు. పవన్ పర్యటనతోనైనా రైతులకు మరింత సాయం అందాలని ఆశిద్ధాం.