Pawan Meets PM Modi: దేశంలో జగనన్న కాలనీ లేఅవుట్లు, గృహ నిర్మాణ పథకాలు ఆదర్శాలుగా ఏపీ సర్కారు చెబుతూ వస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత పెద్దల సాహసానికి పూనుకోలేదని వైసీపీ ప్రజాప్రతినిధులు చెబుతూ వచ్చారు. కానీ దీని వెనుక జరిగిన అవినీతి మూలాలతో సహా పెకిలించేందుకు జనసేనాని పవన్ సిద్ధమవుతున్నారు.ఏపీ సర్కారుపై మరో పోరాటానికి నిర్ణయించారు. జనసేన సోషల్ ఆడిట్ పేరిట ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి గృహనిర్మాణం వరకూ జరిగిన వేలాది కోట్ల రూపాయల స్కాంను గణాంకాలతో సహా వెలికి తీసేందుకు పవన్ ప్రణాళిక రూపొందించారు. నేరుగా కాలనీ లేఅవుట్లను సందర్శించి అక్కడున్న లోటుపాట్లను ఎత్తిచూపనున్నారు. అక్కడున్న మార్కెట్ రేటు ఎంత? ప్రభుత్వం కొనుగోలుచేసింది ఏ మొత్తానికి? దాని మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత? అని తెలుసుకోనున్నారు. పోస్టుమార్టం చేసి నివేదికను ప్రజలకు తెలియజేయనున్నారు,

ఒక్క జగనన్న కాలనీ పథకంలో రూ.75 వేల కోట్ల అవినీతి జరిగినట్టు ఇప్పటికే జనసేన హైకమాండ్ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ లేఅవుట్ల కోసం 23 వేల ఎకరాలను సేకరించారు. కానీ కొండలు, కోనలు, స్మశానవాటికలు, ఊరికి దూరంగా, నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో భూములను సేకరించారు. వీటికి వంద రెట్ల ధర పెంచి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేనిచోట అధికార పార్టీ నాయకులకు చెందిన నిరూపయోగ భూములకు తెరపైకి తెచ్చారు. ఎందుకూ పనికిరాని భూములను లక్షల్లో రేటు కట్టి పేదల ఇళ్ల స్థలాల మాటున దోచుకున్నారు. పేద లబ్ధిదారుడికి సెంటు భూమి అందించి.. వేల రూపాయలకు కూడా ఎవరూ కొనని భూమిని లక్షల రూపాయలు విక్రయించారు. వీటిపై పక్కా ఆధారాలను జనసేన ప్రత్యేక బృందం సేకరించింది. దీనినే అజెండాగా తీసుకొని పవన్ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
ఈ నెల 13న పవన్ విజయనగరంలో పర్యటించనున్నారు. నగర లబ్ధిదారులకు సంబంధించి గుంకలాం సమీపంలో లేఅవుట్ వేశారు. కానీ ఎటువంటి వసతులు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఈ లేఅవుట్ రాష్ట్రంలోనే పెద్దది. వేలాది మంది లబ్ధిదారులకు ఇక్కడ ఇళ్ల పట్టాలు అందించారు. ఇందుకుగాను వందలాది ఎకరాల భూమిని సేకరించారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. అధికార పార్టీ పెద్ద నేతలకు భారీగా నగదు ముట్టినట్టు జనసేన హైకమాండ్ వద్ద సమాచారం ఉంది.అటు లబ్ధిదారుల నుంచి చోటా నాయకులు సైతం వసూళ్ల పర్వానికి తెరతీశారు. పోనీ ఇంత చేసినా.. లేఅవుట్ లో మౌలిక వసతులు కల్పించారంటే అదీ లేదు. అందుకే పవన్ తన ‘సోషల్ ఆడిట్’ కార్యక్రమాన్ని గుంకలాంనే వేదికగా చేసుకున్నారు. 14న రాజమండ్రిలో పవన్ పర్యటించనున్నారు. అందుకు సంబంధించి పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

అయితే పవన్ తాజా పర్యటనతో వైసీపీలో కలవరం ప్రారంభమైంది. సాధారణ పర్యటనల్లో తన కామెంట్స్ తో పవన్ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. అదే ఒక ప్రత్యేక అజెండాతో ప్రభుత్వపాయల అవినీతి జరిగిందని జనసేన నుంచి వినిపిస్తున్న మాట. అందుకే నిజాశించిన స్థాయిలో లేదు. దీంతో లేఅవుట్లలో గృహ నిర్మాణం నిలిచిపోయింది. అటు ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం అవినీతి, నిర్లక్షాన్ని ప్రపంచానికి తెలియలు నిగ్గు తేల్చేందుకు పవన్ పర్యటించనున్నారు. ఇప్పటికే ప్రధానితో భేటీ అయి.. వైసీపీ సర్కారు విధ్వంసపాలనపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీ లేఅవుట్లలో అవినీతిని ఎండగట్టేందుకు పవన్ బయలుదేరుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.