Homeఆంధ్రప్రదేశ్‌'బ్లూ' మీడియా పవన్ పై బురద చల్లితే... జగన్ కు మరక అంటుకుందే

‘బ్లూ’ మీడియా పవన్ పై బురద చల్లితే… జగన్ కు మరక అంటుకుందే

విశాఖలో తాజాగా నూతన్ నాయుడు, అతని కుటుంబం ఒక దళిత వ్యక్తికి శిరోముండనం చేశారు. ఇక ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్నది ‘బ్లూ మీడియా’ కథనం. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వారికి ఎటువంటి సెగ తగలకుండా కాపాడే ఈ బ్లూ మీడియా నెమ్మదిగా ఈ విషయాన్ని జనసేన పార్టీ వైపు మళ్ళించాలని ప్రయత్నం చేసింది. నిజానికి సదరు వ్యక్తికి గతంలో వైఎస్సార్సీపీతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి లక్షల మంది అభిమానుల్లాగే అతను కూడా ఆకర్షితుడయ్యాడు.

ఇక ఇప్పటి వరకూ ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఈ కేసులో పోలీసులు ఆ వ్యక్తిని మీద ఎలాంటి ఆరోపణలు చేయలేదు. చాలా గంటలు బాధితుడు కూడా కేసు ఫైల్ చేయలేదు. కానీ బ్లూ మీడియా మాత్రం ఈ లోపలే ఎక్కడ తమ నేత మెడకు చుట్టుకుంటుందేమో అనే భయంతో వివాదాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అంటగట్టే ప్రయత్నం చేసింది. దాని తర్వాత నూతన్ నాయుడు అతని భార్యతో సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కేసులో ఇరుక్కుపోయాడు అని… అతని అభిమాని ఇటువంటి పనులు చేస్తున్నాడు అని సదరు మీడియా వాదించింది.

సరే.. “అసలు ఆ వ్యక్తితో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేద”ని జనసేన పార్టీ ఖండించిన తర్వాత కూడా బ్లూ మీడియా ఇలాగే చేస్తుంది…. బాగుంది. ఇప్పుడు వారి కోణంలో ఆలోచిస్తే వైసీపీకి చెందిన సినీ నటుడు హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన “దళిత యువతిపై ఐదు వేల సార్లు రేప్” కేసులో ఇరుక్కున్న వార్తలు వచ్చాయి. మరి ఇక్కడ వైసిపి పార్టీ కానీ వారి అధినేత కానీ ఈ కేసుతో ఏమైనా సంబంధం ఉన్నట్లా…? అలాగని ఇదే లాజిక్ ప్రకారం ‘బ్లూ మీడియా’ తీర్మానించగలదా…?

ప్రతి విషయంలో జనసేన పై విషం చిమ్మడం ‘బ్లూ మీడియా’ పని గా మారిపోయింది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మెగా కాంపౌండ్ మీద పడి ఏడవడం తప్పించి వారికి వేరే పని ఉండదు. ‘ఆచార్య’ సినిమా చుట్టూ కాపీ వివాదాన్ని కూడా మొదట రాజేసింది వారే. ఇప్పుడు విశాఖ సిరోముండనం ఘటన ను పవన్ కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ కు ఈ ఘటనతో సంబంధం ఉంటే జగన్ కు హైదరాబాద్ లో జరిగిన ఘటన తో కూడా సంబంధం ఉండి ఉండాలి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. దీనికి వారిని ఏమంటారు..?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version