https://oktelugu.com/

సంచలనం.. సుశాంత్ ది హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి..!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. రోజుకో కొత్త ట్వీస్ట్ వెలుగు చూస్తుండటంతో సుశాంత్ సింగ్ మృతిపై ప్రజల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. సుశాంత్ సింగ్ మృతికి నెపోటిజమే కారణమని నెటిజన్లు బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. దీంతోపాటు సుశాంత్ సింగ్ మాజీ లవర్ రియా చక్రవర్తి.. ఇతర సినీ ప్రముఖుల వేధింపుల కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు విన్పించాయి. Also Read: ఓటీటీలోకి మరో లెజెండరీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 30, 2020 / 01:20 PM IST
    Follow us on


    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. రోజుకో కొత్త ట్వీస్ట్ వెలుగు చూస్తుండటంతో సుశాంత్ సింగ్ మృతిపై ప్రజల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. సుశాంత్ సింగ్ మృతికి నెపోటిజమే కారణమని నెటిజన్లు బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. దీంతోపాటు సుశాంత్ సింగ్ మాజీ లవర్ రియా చక్రవర్తి.. ఇతర సినీ ప్రముఖుల వేధింపుల కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు విన్పించాయి.

    Also Read: ఓటీటీలోకి మరో లెజెండరీ క్రికెటర్ !

    అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదంటూ సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు, అతని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు రాజకీయ నాయకులు, మాజీ పోలీస్ అధికారులు సైతం సుశాంత్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సుశాంత్ ను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఈ కేసుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఈ కేసును సీబీఐ ఛాలెంజ్ గా తీసుకొని దర్యాప్తు వేగవంతం చేస్తుండటంతో త్వరలోనే అసలు నిజాలు బయటికి రానున్నాయి.

    తాజాగా సుశాంత్ పోస్టుమార్టం సమయంలో ఉన్న ఓ ప్రత్యక్షసాక్షి సంచలనం విషయాలను వెల్లడించారు. సుశాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూపర్ ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు సుశాంత్ సింగ్ భౌతికకాయాన్ని మొసుకెళ్లారు. వారిలో ఒక వ్యక్తి పోస్టుమార్టం సమయంలో వైద్యులు మాట్లాడుకున్న విషయాన్ని ఓ మీడియాకు వెల్లడించించారు. తాను పోస్టుమార్టం గదిలోకి వెళ్లినపుడు వైద్యులు సుశాంత్ సింగ్ ది హత్యేనని మాట్లాడుకోవడం విన్నానని చెప్పాడు.

    Also Read: బడా ప్రొడ్యూసర్ తో ప్రభాస్‌ మరో బాలీవుడ్‌ మూవీ?

    అంతేకాకుండా సుశాంత్ సింగ్ భౌతికకాయాన్ని పట్టుకున్నపుడు ఆయన గొంతు చుట్టురా సెల్లో టేప్‌ ఆనవాళ్లను ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపాడు. శరీరంపై సూదులతో గుచ్చిన ఆనవాళ్లు ఉన్నాయని.. సుశాంత్ కాలు ఒకటి ఫ్రాక్చర్ అయినట్లు గమనించినట్లు తెలిపాడు. ఇక సుశాంత్ సింగ్‌ను మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన రియా చక్రవర్తి ‘ఐయాం సారీ’ అంటూ విలపించిందని పోస్టుమార్టం సమయంలో అక్కడే ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి జాతీయ మీడియా వెల్లడించడం సంచలనం రేపుతోంది.

    మరోవైపు సుశాంత్ సింగ్ కు పోస్టుమార్టం చేసిన కూపర్ హాస్పిటల్ వైద్యులు సెలవుపై వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈనేపథ్యంలో సీబీఐ సుశాంత్ ఆత్మహత్య మిస్టరీని ఎలా చేధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.