కేటీఆర్ హడావుడికి కారణం అదేనా?

త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో టీఆర్ఎస్ నాయకులు గ్రేటర్లో హడావుడి చేస్తున్నారు. ఇక గ్రేటర్ బాధ్యతలను భుజాన మోస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ హడావుడి మాములుగా లేదనే టాక్ విన్పిస్తోంది. గత నాలుగేళ్లుగా పూర్తికానీ పనులన్నీ మరో నాలుగు నెలల్లో పూర్తి చేసేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు ఆఘమేఘాల మీద ఉరుకులు పరుగులు పెడుతున్నారు. Also Read: పదవీ విరమణపై.. ఉద్యోగుల్లో టెన్షన్? గత జీహెచ్ఎంసీ […]

Written By: Neelambaram, Updated On : August 30, 2020 11:55 am
Follow us on


త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో టీఆర్ఎస్ నాయకులు గ్రేటర్లో హడావుడి చేస్తున్నారు. ఇక గ్రేటర్ బాధ్యతలను భుజాన మోస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ హడావుడి మాములుగా లేదనే టాక్ విన్పిస్తోంది. గత నాలుగేళ్లుగా పూర్తికానీ పనులన్నీ మరో నాలుగు నెలల్లో పూర్తి చేసేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు ఆఘమేఘాల మీద ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

Also Read: పదవీ విరమణపై.. ఉద్యోగుల్లో టెన్షన్?

గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ నగరవాసులు బోలెడన్నీ హామీలిచ్చారు. నగరవాసులకు ఆశల పల్లకి చూపడంతో ఆ ఎన్నికల్లో ప్రజలంతా అధికార పార్టీకే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద స్థానాలను గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేయగా అందుకు తగ్గట్టుగానే టీఆర్ఎస్ 99 స్థానాల్లో గెలిచి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఆ ఎన్నికల్లో కేటీఆర్ ఇచ్చినా హామీల్లో నేటికీ చాలావరకు పెండింగులోనే ఉన్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని నెలల్లో గ్రేటర్లో ఎన్నికలు జరుగనుండటంతో ప్రభుత్వం నగర అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం వేల కోట్ల నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులను చేపడుతోంది. రహదారుల అభివృద్ధి, జలాశయాల సుందరీకరణ, స్కైవేల ఏర్పాటు, రేయిన్ గార్డెన్‌ల నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్‌కు సొబగులు, తార్నాకలో టీవోడీ వంటి నిర్మాణాలను చేపట్టేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అక్టోబర్ నాటికి బాలానగర్ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తిచేసి నగరవాసులకు కానుకగా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

వీటితోపాటు హుస్సేన్ సాగర్ కోసం ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ అధికారులు రూపొందిస్తున్నారు. పదెకరాల్లో రూ.12కోట్లతో లేక్ వ్యూ ఫ్రంట్ పార్కు నిర్మాణ పనులు.. ఉప్పల్ భగాయత్‌తోపాటు మరో 9ప్రదేశాల్లో రేయిన్ గార్డెన్‌లను నిర్మించేలా సన్నహాలు చేస్తున్నారు. నగర శివార్లలోని జల్‌పల్లి, రాంపల్లి చెరువులతోపాటు మరో 18చెరువులను సుందరీకరించేందుకు టెండర్లను పిలవాలని అధికారులకు నిర్ణయించారు. నగరంలో పాదచారుల ఇబ్బందులు తొలగించేలా ప్రత్యేక ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు.. పలు చోట్ల స్కైవేలను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: వందల కోట్లు వృథా.. టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిర్వాకం

వీటిన్నింటికి ఎంత ఖర్చు అయినా వెనుకడొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండటంతో అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. ఇన్నిరోజులు పెండింగులో ఉన్న పనులన్నీ ఒక్కసారి చేయాల్సి వస్తుండటంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతున్ననట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా సాకుతో ఇంటికే పరిమితమైన నేతలంతా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నగరంలో నిత్యం పర్యటనలతో హడావుడి చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.