Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Varahi Registration: జగన్ నో చెప్పారు.. కేసీఆర్ ‘ఎస్’ అన్నాడు..పవన్ కళ్యాణ్ పంతం...

Pawan Kalyan Varahi Registration: జగన్ నో చెప్పారు.. కేసీఆర్ ‘ఎస్’ అన్నాడు..పవన్ కళ్యాణ్ పంతం నెగ్గింది.. వారాహి రిజిస్ట్రేషన్ నంబర్ ఇదే

Pawan Kalyan Varahi Registration: ఎన్నికల యుద్ధానికి బయల్దేరేందుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ప్రచార రథం ‘వారాహి’కి అడ్డంకులు తొలగిపోయాయి. ఆ వాహనం ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టకుండా చూడాలని వైసీపీ సర్కార్‌ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. జగన్‌ నో చెప్పినా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎస్‌ అనడంతో తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించటం.. రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తయింది. విషయాన్ని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ పాపారావు స్వయంగా వెల్లడించారు. దీంతో ఇక జనసేనాని వారాహిపై ఎన్నికల కదనరంగంలోకి దూకనున్నారు.

Pawan Kalyan Varahi Registration
Pawan Kalyan Varahi

-రంగుపై వివాదం..
‘పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల వాహనం ‘వారాహి’ వాహనం ఆర్మీ రంగులో ఉంది ఈ వాహనం రిజస్ట్రేషన్‌ కు రవాణాశాఖ అనుమతి ఉంటుందో ఉండదో.. ఇదేమీ సినిమా కాదు ఇష్టమొచ్చిన వాహనాలు ఉపయోగించటానికి..పవన్‌ రీల్‌ లైఫ్‌ అనుకుంటున్నారేమో.. ఇది రియల్‌ లైఫ్‌ .. ఇటువంటి రంగు వాహనంతో పవన్‌ సినిమా స్టైల్లో ప్రచారాలు చేద్దామనుకుంటే కుదరదు ’ అంటూ వైసీపీ నేతలు పలు విమర్శలు చేశారు. ఈ విమర్శలకు చెక్‌ పెడుతూ..తెలంగాణ రవాణా శాఖ వారాహి వాహనాన్ని రిజస్ట్రేషన్‌ చేసింది. వారాహి నంబర్‌ను స్వయంగా కమిషనరే ‘వారాహి’ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ TS 13 EX 8384 అని తెలిపారు.

-వైసీపీకి ఝలక్‌..
వారాహి వాహనం రంగుపై వైసీపీ నేతల విమర్శల నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి కావటంతో వైసీపీ ఇది కచ్చితంగా పెద్ద ఝలక్‌ అనే చెప్పాలి. వారి విమర్శలకు వారాహి రిజిస్ట్రేషన్‌తో చెక్‌ పడింది. కానీ వైసీపీ నేతలు తమదైన శైలిలో ఇంకా ఎటువంటి లూప్‌ హోల్స్‌ వెదికి విమర్శలు చేస్తారో వేచి చూడాలి. వారాహి వాహనం రంగుపై ఎటువంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసి రిజిస్ట్రేషన్‌ చేయటంతో జనసేన కార్యకర్తల్లో మరింత ఉత్సాహం రేగింది. ఇప్పుడేమంటారో చెప్పండీ అంటూ వైసీపీ కౌంటరిస్తున్నారు జన సైనికులు.

Pawan Kalyan Varahi Registration
Pawan Kalyan Varahi Registration

-ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకే..
ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వినూత్న రీతిలో వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ వాహనానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ఈ వాహనంతో ఓ వీడియో కూడా షూట్‌ చేసి ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు. అంతే ఇక వైసీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది సినిమా కాదు డబ్బులున్నాయి కదాని ఇష్టమొచ్చిన వాహనం కొనేసుకుని ఇష్టమైన రంగు వేసుకుని తిరిగేయటానికి.. అంటూ వైసీపీ నేతలకు ఉన్న అవగాహనతో తమైనశైలిలో విమర్శలు సంధించారు. వీటికి పూర్తిగా చెక్‌ పెట్టింది తెలంగాణ రవాణా శాఖ.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version