
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో జనసేన ప్రజా పోరాటానికి సిద్ధమవుతోంది. అధినేత పవన్ కల్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ శనివారం కీలక ప్రకటన చేశారు. ప్రజా సేవ కోసమే జన సైనికులు పనిచేయాలని సూచించారు. జనసేన బీజేపీని వదిలి టీడీపీలో చేరతారనే ప్రచారం నేపథ్యంలో పవన్ కల్యాణ్ బీజేపీ నేతలు మాకు మిత్రులే అని చెప్పడం గమనార్హం. దీంతో బీజేపీకి జనసేనతో పొత్తు ఉంటుందనేది తెలుస్తోంది.
నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు 12 మున్సిపాలిటీలకు ఈ నెల 15న నిర్వహించే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. రాష్ర్టంలో ప్రజల పక్షాన నిలిచి పోరాడేందుకు జన సైనికులు రెడీ అవుతున్నారు. ప్రజాపోరులో నిలిచి పార్టీని నలుదిశలా వ్యాపింపచేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రజా సమస్యల పరిష్కారానికి పాటు పడాలని భావిస్తున్నారు.
నెల్లూరు కార్పొరేషన్ తోపాటు ఆకినీడు, బుచ్చిరెడ్డిపాలెం, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, కుప్పం, దర్శి, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండతోపాటు గుంటూరు కార్పొరేషన్, రేపల్లె మున్సిపాలిటీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో జనసేన ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగిస్తున్న క్రమంలో ప్రజల నుంచి స్పందన వస్తుందని తెలుసుకుని ఉత్సాహంతో కదులుతున్నట్లు సమాచారం. ఇకపై ప్రజల్లో ఉండే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో జనసేన విస్తరించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: పవన్ ‘ఉక్కు పోరాటం’ అసలు కథేంటి..?