
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ తన ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తూ ప్రజల్లో తన ఓటు బ్యాంకును కాపాడుకుంటోంది. దీంతో రాష్ర్టంలో అటు టీడీపీ, ఇటు జనసేన మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ లు ఉండడంతో జగన్ ఏ మేరకు విజయం సాధిస్తారోననే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీ గొడవలకు పోయి తన ప్రతిష్టను మరింత దిగజార్చుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ మనుగడపై ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో పార్టీ ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరిపేందుకు వచ్చే నెలలో జగన్ తో పీకే సమావేశం కానున్నారు. దీంతో ఈ భేటీలో రాబోయే ఎన్నికలపై ఓ స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా మంత్రివర్గ విస్తరణపై కూడా ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే నానుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఓ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. మంత్రివర్గ కూర్పు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంటుందనే చర్చ సాగుతోంది.
డిసెంబర్ నుంచి పార్టీ ప్రజల్లోకి వెళ్లి పథకాల అమలుపై చర్చించనున్నారు. ప్రజల ఎంత మేర సంతృప్తి పొందుతున్నారు? ప్రభుత్వ పథకాలతో ఆర్థిక ప్రగతి ఏ విధంగా జరుగుతుంది తదితర విషయాలపై కూలంకషంగా చర్చించి ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పీకే ఆధ్వర్యంలో పార్టీ మంత్రివర్గ విస్తరణ పై స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 2024 ఎన్నికలే లక్ష్యంగా జగన్ ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నల్లు తెలుస్తోంది.
మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే నివేదికలు తయారు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వైసీపీ కూడా అదే తీరుగా ప్రణాళికలు రచిస్తోంది. రెండు పార్టీలకు జీవన్మరణ పోరాటంగా భావిస్తున్న తరుణంలో ఎన్నికల కోసం తగు విధంగా ఆలోచలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఏపీ(Andhra Pradesh)
లో రాజకీయ పరిణామాల్లో మార్పులు వస్తున్నట్లు సమాచారం.