బాబు వెయ్యి చెబితే.. నేను 250 చెబుతా..: పంచాయతీ పోరులో పార్టీల లెక్కలు

ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికల రెండు విడతల్లో ముగిశాయి. మూడో విడత పోలింగ్‌ నేడు కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో నాలుగో విడత ఎలక్షన్‌ జరగబోతోంది. దీంతో ఇప్పుడు పార్టీలు లెక్కల్లో మునిగిపోయాయి. తమ పార్టీ అధిక సీట్లను సాధించిందంటే.. తమ పార్టీనే సాధించిందని గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ పార్టీ గెలిచిన లిస్టును చదివారు. ఈ లిస్టును చూసిన వైసీపీ నేతలు బిత్తరపోయారు. Also Read: ‘సాగర’ మథనం: తెలంగాణలో ఎన్నికల వాతావ‘రణం’ […]

Written By: Srinivas, Updated On : February 17, 2021 1:48 pm
Follow us on


ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికల రెండు విడతల్లో ముగిశాయి. మూడో విడత పోలింగ్‌ నేడు కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో నాలుగో విడత ఎలక్షన్‌ జరగబోతోంది. దీంతో ఇప్పుడు పార్టీలు లెక్కల్లో మునిగిపోయాయి. తమ పార్టీ అధిక సీట్లను సాధించిందంటే.. తమ పార్టీనే సాధించిందని గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ పార్టీ గెలిచిన లిస్టును చదివారు. ఈ లిస్టును చూసిన వైసీపీ నేతలు బిత్తరపోయారు.

Also Read: ‘సాగర’ మథనం: తెలంగాణలో ఎన్నికల వాతావ‘రణం’

రెండు విడతల్లో పంచాయతీ రిజల్ట్స్‌ల్లో సగానికి సగం సీట్లు తమవేనంటూ బాబు చెప్పుకొచ్చారు. బాబు తప్పుడు ప్రచారాన్ని ఆపడానికి ఏకంగా ఓ వెబ్ సైటే పెట్టుకుని తంటాలు పడుతోంది వైసీపీ. ఇది చాలదన్నట్టు ఇప్పుడు పవన్ తెరపైకి వచ్చేశారు. మీరు మీరు విజేతల విషయంలో కొట్టుకుంటున్నారు.. జనసేన ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగిన 3,328 స్థానాల్లో ఏకంగా 250 స్థానాల్లో విజయం తమదేనంటూ ప్రకటించారు జనసేనాని. 1500 వార్డుల్లో కూడా జనసేన బలపరిచిన అభ్యర్థులు విజేతలుగా నిలిచారని సెలవిచ్చారు.

తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో జనసేనకి 18 శాతం సీట్లు వచ్చాయని రెండో విడతలో ఏకంగా 22 శాతానికి ఓట్లు పెరిగాయని అంటున్న పవన్, రెండో విడత లిస్ట్ పట్టుకుని రావడం ఏంటో ఎవరికీ అర్థం కావడంలేదు. అసలు తొలి విడత ఎన్నికలు జరిగినప్పుడు, ఫలితాలు వచ్చినప్పుడు పవన్ పూర్తిగా సినిమాల్లో మునిగిపోయారు. పార్టీలు, పార్టీ గుర్తులు లేని ఎన్నికలు కావడంతో చంద్రబాబు నోటికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. అది చూసి పవన్ ఇప్పుడు రంగంలోకి దిగారు.

Also Read: ఆ పార్టీలతోనే దీదీకి నష్టం

బాబు వెయ్యి సీట్లు గెలిచారంటే జనం నమ్మేస్తున్నారు.. తాను 250 సీట్లు గెలిచానని చెబితే నమ్మరా ఈ జనం అనే భరోసాతో ఉన్నారు. అందుకే కాస్త లేటుగా అయినా లెటెస్ట్‌గా మూడో విడత ఎన్నికలు జరగబోయే ముందురోజు ఇలా చిట్టా విడుదల చేశారు. టీడీపీనే పూచిక పుల్లలా తీసి పక్కన పడేశారు వైసీపీ నేతలు. ఇక జనసేన, బీజేపీ విడివిడిగా వచ్చినా, కలివిడిగా వచ్చినా పట్టించుకుంటారా..? కానీ.. జనసేనాని మాత్రం జనసేనను చూసి వైసీపీ భయపడుతోందంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్