ఏపీలో ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఉక్కు ఉద్యమం నడుస్తోంది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం వంద శాతం అంగీకారం తెలపడంతో ఉద్యమం రాజుకుంది. ఇప్పటికే ఉక్కు ఫ్యాక్టరీని తిరిగి సాధిస్తుకొస్తామని బీజేపీ లీడర్లు హస్తిన బాటపట్టారు. వారు ఢిల్లీ వెళ్లి మూడు రోజులు అవుతోంది. వారు స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీ హైకమాండ్ నుంచి కానీ.. కేంద్రమంత్రుల నుంచి ఎలాంటి హామీని పొందలేకపోయినట్లుగా తెలుస్తోంది.
Also Read: బాబు వెయ్యి చెబితే.. నేను 250 చెబుతా..: పంచాయతీ పోరులో పార్టీల లెక్కలు
ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమైనప్పటికీ.. వారికి ఎలాంటి క్లారిటీ రాలేదు. జేపీ నడ్డాతో స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించడానికి చాన్స్ కూడా ఇవ్వలేదు. పార్టీ పరమైన వ్యవహారాలపై మాత్రమే తనతో మాట్లాడాలని.. మిగతా విషయాలపై మంత్రుల్ని కలవాలని ఆయన మొహం మీదనే చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరెవరూ కాదు.. అమిత్ షాను కలిస్తేనే ఏపీలో ప్రజలు కాస్తంత నమ్ముతారని అనుకుంటున్నారు.
అందుకే.. ఎలాగైనా పెద్దల అపాయింట్‌మెంట్ తీసుకొని ఏదో ఒక హామీతోనే తిరిగి వెళ్లాలని డిసైడ్ అయ్యారట. ఓ వైపు ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం ఊపందుకుంటోంది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే.. ఆయా పార్టీల నేతలు వ్యతిరేకించడానికి బీజేపీ నేతలు వ్యతిరేకించడానికి స్పష్టమైన తేడా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తాము వ్యతిరేకించడం మాత్రమే కాదు.. ఆ నిర్ణయాన్ని ఆపాల్సిన బాధ్యత కూడా ఉంది.
Also Read: ఎన్నికలకు ముందే గ్రేటర్ కమిషనర్ ట్రాన్స్‌ఫర్..: నిమ్మగడ్డ మార్క్ బదిలీ వేటు
అయితే.. ఈ విషయాన్ని చెప్పుకునేందుకు టైమ్ ఇవ్వడం లేదు బీజేపీ హైకమాండ్. ఇప్పుడు వారు ఏపీకి వచ్చి ఏం చెబుతారన్నది ఆసక్తికరమే. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం అడ్వాన్స్ స్టేజ్‌కు వెళ్లిందని.. ప్రైవేటీకరణ ప్రక్రియను చాలా చురుగ్గా కొనసాగిస్తోందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏపీ బీజేపీ నేతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక హోదా అంశం సాధ్యం కాదని.. ముగిసిపోయిన అంశమనే చెబుతున్నారు. కానీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మంచిదేనని కేంద్రం నిర్ణయాన్ని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టే అంశం కాదని భావిస్తున్నారు. అందుకే.. హస్తినలోనే ఉండి ఏదో ఒక గట్టి హామీ తీసుకోవాలని అనుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్