Pawan Kalyan Rythu Bharosa Yatra: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్తున్నారు. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలు ఆకళింపు చేసుకుని వాటి పరిష్కారానికి చర్యల తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కౌలు రైతుల బాధలు తీర్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి గాను బాధిత కుటుంబాలను ఓదార్చుతూ వారికి ఆర్థిక సహాయం అందజేయడం నిజంగా ముదావహం. నాయకుడు ఎక్కడి నుంచో రాడు జనం నుంచే అని పవన్ కల్యాణ్ నమ్మిన సిద్ధాంతానికి న్యాయం చేస్తున్నారు.
ఈ మేరకు పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రకు శనివారం శ్రీకారం చుట్టారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం జానంపేట గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మల్లికార్జున రావు కుటుంబాన్ని పరామర్శించారు. వారికి రూ. లక్ష చెక్కు అందజేశారు. అనంతరం వారిని ఓదారుస్తూ మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇద్దరు ఆడపిల్లల చదువు కోసం పార్టీ ఖర్చు చేసి ఆదకుంటుందని హామీ ఇచ్చారు.
Also Read: Rajasthan High Court: భార్యకు గర్భం తెప్పించేందుకు జైల్లో ఉన్న భర్తకు పెరోల్
తరువాత చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెం లో కూడా కౌలు రైతు దాసరి రాజారావు కుటుంబాన్ని పరామర్శించారు. వారికి కూడా రూ. లక్ష చెక్కు అందజేసి ఆయన కుమారుడి బాధ్యత జనసేన చూసుకుంటుందని చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల ఇబ్బందుల గురించి ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రభుత్వంలో చలనం రాకపోవడంతోనే ఈ మేరకు రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కౌలు రైతుల బాధలు తీర్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని కోసం ఎన్ని వ్యవయప్రయాసలైనా భరిస్తామని చెబుతున్నారు. రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తామని భరోసా కల్పిస్తున్నారు. దీంతో వైసీపీలో కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. జనసేన పార్టీ ప్రజల్లో దూసుకుపోతే ఇక భవిష్యత్ ఏమిటనే బెంగ పట్టుకుంది. మొత్తానికి పవన్ కల్యాణ్ ఎంచుకున్న మార్గం సత్ఫలితాలు ఇచ్చేదిగా ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఏపీలో కచ్చితంగా జనసేన తన ప్రభావం చూపిస్తుందని అందరు అంచనా వేస్తున్నారు. ప్రజల మనసులు గెలుచుకున్న వాడే నాయకుడు అని తేల్చుతున్నారు. దీని కోసమే పవన్ కల్యాణ్ ప్రజాక్షేత్రంలోకి దూసుకువెళ్తున్నట్లు సమాచారం. మొత్తానికి రాజకీయ పరిణామాలు మారడం ఖాయమనే వాదనలు సైతం వస్తున్నాయి.
Also Read:Prashanth Neel: కేజీఎఫ్ చాప్టర్-2లో ఆ పాత్రలు అందుకేనట.. ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్