https://oktelugu.com/

SaReGaMaPa Parvathi: నువ్వు పాడుతున్న శృతి ఏంటి? రాగమేంటి? గాయని ‘పార్వతి’కి షాకిచ్చిన కోటి

SaReGaMaPa Parvathi:  సరిగమప.. జీతెలుగులో ప్రసారమయ్యే ఈ షో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో పాడేది గొప్ప సింగర్ లు కాదు.. సినిమాల్లో పాడిన వారు కాదు.. మామూలు పల్లెటూరు, నగరాల్లో తమ వాయిస్ వినిపించి సత్తా చాటుదామని కలలుగన్న వారు. అలాంటి మరుగునపడిపోయిన టాలెంట్ ను వెలికి తీస్తోంది ఈ షో. సినిమా పాటలు పాడే ప్రముఖ సింగర్లను టీం మేట్స్ గా చేసి వారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల మంచి గాయకులను […]

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2022 / 03:38 PM IST
    Follow us on

    SaReGaMaPa Parvathi:  సరిగమప.. జీతెలుగులో ప్రసారమయ్యే ఈ షో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో పాడేది గొప్ప సింగర్ లు కాదు.. సినిమాల్లో పాడిన వారు కాదు.. మామూలు పల్లెటూరు, నగరాల్లో తమ వాయిస్ వినిపించి సత్తా చాటుదామని కలలుగన్న వారు. అలాంటి మరుగునపడిపోయిన టాలెంట్ ను వెలికి తీస్తోంది ఈ షో. సినిమా పాటలు పాడే ప్రముఖ సింగర్లను టీం మేట్స్ గా చేసి వారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల మంచి గాయకులను వెతికి ఇందులో పాడిస్తున్నారు..

    ఈ పాటల పూదోటలో విరబూసిందే మన ‘పార్వతి’. ఈ పేదింటి కుసుమం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పాటే ప్రాణంగా భావించి సరిగమప షో వరకూ వచ్చింది. ఇందులో ఆమె పాడిన పాటకు ఫిదా అయ్యి జడ్జి స్మిత పార్వతి కోరికలు తీర్చారు.ఆమె ఊరికి బస్ వేయించారు. ఇక తాజాగా ఆమె పళ్లకు సర్జరీ చేయడానికి కూడా ఓ ప్రముఖ డాక్టర్ ముందుకొచ్చాడు. ఇలా పార్వతి పాటకు ఫిదా అయ్యి ఎంతో మంది సంగీతాభిమానులు ఆమె పేదరికాన్ని పారద్రోలేందుకు తమ వంతు సహాయం చేస్తున్నారు.

    Also Read: Rashmi Gautam: అందాల‌తో రెచ్చిపోతున్న ర‌ష్మీ.. అలా వంగి అందాల జాతర..‌

    తాజాగా సరిగమప షో ప్రోమో విడుదలైంది. ఇందులో పార్వతి ‘వకీల్ సాబ్’ చిత్రంలోని ‘మగువ మగువ’ సాంగ్ పాడడానికి రెడీ అయ్యింది. అయితే ఆమె శృతి వాయిస్ వినిపించకపోవడంతో పాట మధ్యలోనే జడ్జి అయిన సంగీత దర్శకుడు కోటి ఆపేశారు.‘శృతి ఏది.. రాగమేది’? అంటూ పార్వతి పాడుతుండగా ఆపేయడంతో అందరూ షాక్ అయ్యారు.

    SaReGaMaPa Parvathi

    కానీ అది పార్వతి పొరపాటు కాదని తర్వాత తెలిసింది. మైక్, సౌండ్ టెక్నికల్ ప్రాబ్లం అని తెలిసి సరిచేసి మరోసారి పార్వతి చేత ఈ పాట పడించారు. కానీ కోటి అలా పాటను మధ్యలోనే ఆపేసి ‘శృతి లేదు పాటలో’ అనేసరికి అందరూ షాక్ అయిన పరిస్థితి నెలకొంది.

    టెక్నికల్ మైక్ సౌండ్ సమస్య తీరడంతో పార్వతి ఈ పాటను అద్భుతంగా పాడింది. ఆమె పాడుతుండగా ఫిదా అయిన తోటి మహిళా కంటెస్టెంట్స్ అంతా స్టేజ్ మీదకు వచ్చి ఆమెతో గొంతు కలపడం విశేషం.

    ఇక పార్వతి ఘనత చూసి ప్రముఖ సినీ ప్రముఖురాలు రోజా రమణి కూడా సన్మానించి గిఫ్ట్ ఇద్దామని అనుకుంది. ఈ స్టేజ్ పైన కాకుండా తన ఇంట్లోనే చేస్తానని.. పబ్లిక్ గా ప్రచారం కోసం చేయకుండా పార్వతిని తన ఇంటికి తీసుకురావాలని సంగీత దర్శకుడు కోటిని అడిగిందట.. దీనికి కోటీ కూడా అంగీకరించి పార్వతిని తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు.

    Recommended Videos: