Pawan Kalyan Road Show: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో దూకుడుతో ‘వారాహి విజయ యాత్ర’ ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాత్ర జనసేన పార్టీ శ్రేణులలో మామూలు ఊపుని తీసుకొని రాలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రారంభమైన ఈ వారాహి విజయ యాత్ర మొదటి విడత విజయవంతంగా తూర్పు గోదావరి జిల్లాలో నిన్న జరిగిన రాజోలు సభతో ముగించుకుంది.
రేపటి నుండి ఆయన ఈ వారాహి యాత్ర ని పశ్చిమ గోదావరి జిల్లాలో చెయ్యబోతున్నారు. రేపు నర్సాపురం లో జరపబోయ్యే భారీ బహిరంగ సభ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపబోతుంది. ఈ సభ గురించి కాసేపు పక్కన పెడితే నిన్న రాజోలు సభ లో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన అంశాలలో హైలైట్ గా నిల్చిన అంశం రాజోలు లో అద్వానంగా ఉన్న రోడ్లు గురించి.
ఆయన మాట్లాడుతూ ‘రాజానగరం సభ నుండి వైసీపీ పార్టీ కి ఛాలెంజి విసురుతున్నాం. మీకు 15 రోజులు సమయం ఇస్తున్నాము. ఈలోపు రాజోలు LIC సెంటర్ లో ఉన్న బైపాస్ రోడ్డు ని వెయ్యకపోతే, మేమె శ్రమదానం చేసి రోడ్డు వేసేస్తాం. మీకు ముందుగానే చెప్తున్నాం, మళ్ళీ గొడవలు పెట్టుకున్నారు అని మమ్మల్ని అనొద్దు. ఆ రోడ్డు ఎంత అద్వానంగా ఉందంటే, గర్భిణీ స్త్రీలు మరియు ముసలి వాళ్ళు అటు వైపు వెళ్తే ప్రాణాలతో తిరిగి రారు. ఏమి చేస్తున్నయ్ వస్తున్న డబ్బులు మొత్తం. సంక్షేమ పథకాలు అమలు చెయ్యండి, మాకేం ఇబ్బంది లేదు. కనీసం రోడ్లు వెయ్యండి. అది పక్కన పెట్టేసి, మేము బట్టన్ నొక్కాము, డబ్బులేసాము అంటే కుదరదు’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఇలాగే ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్స్ ఎంత అద్వానంగా ఉన్నాయో , జాతీయ స్థాయిలో అందరికీ అర్థం అయ్యేలా చేసాడు, ప్రభుత్వం వెయ్యకపోతే ఆయన అభిమానులే రోడ్స్ చాలా ప్రాంతాలలో వేసి సోషల్ మీడియా లో ఫోటోలు మరియు వీడియోలు అప్లోడ్ చేసారు.