Pawan Kalyan- Mudragada Padmanabham: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ‘వారాహి విజయ యాత్ర’ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ కి అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సభలకు మహిళలు ఎక్కువగా హాజరవ్వడం విశేషం. గతం లో పవన్ సభలకు అత్యధికంగా యూత్ వచ్చేవారు, కానీ ఈ సారి సీన్ మొత్తం మారిపోయింది.
యూత్ తో పాటుగా మహిళలు, వృద్దులు కూడా పవన్ సభలకు భారీగా హాజరవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మొదటి విడత లో నిర్వహించిన సభలలో ఎక్కువ రెస్పాన్స్ ని దక్కించుకుంది కాకినాడ సభ, ఈ సభలో పవన్ కళ్యాణ్ ద్వారం పూడి చంద్ర శేఖర్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు. దీనికి ముద్ర గడ్డ పద్మనాభం రెచ్చిపోయి మూడు పేజీల బహిరంగ లేఖని పవన్ కళ్యాణ్ కి రాసి పంపాడు.
దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తల నుండి చాలా తీవ్రమైన రెస్పాన్స్ వచ్చింది. నిన్న జరిగిన రాజోలు సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయం లో అభిమానులు ముద్రగడ్డ పద్మనాభం ఫోటో పై ‘కప్పుద్రోహి’ అని రాయించి బ్యానర్స్ తో సభా స్థలి లో కనిపించారు. ఇది చూసిన పవన్ కళ్యాణ్ ‘దయచేసి అది క్రిందకు దించండి ప్లీజ్.నా కోసం నా మాట విని అవి దించండి. పెద్దోళ్ళు ఎదో అంటారు, మనం దానికి తిట్టకూడదు, పట్టించుకోకుండా వదిలేయాలి’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పగా వెంటనే అభిమానులు ఆ బ్యానర్స్ ని పక్కన పడేసారు.
పవన్ కళ్యాణ్ చూపించిన ఈ గెస్చర్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. తనని టార్గెట్ చేస్తూ పదే పడే లేఖలు రాస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ వయస్సుకు గౌరవం ఇచ్చి ముద్రగడ్డ పై చూపించిన ఈ సానుభూతి హర్షణీయం అని మెచ్చుకుంటున్నారు.