కష్టకాలం..ఉద్యోగుల కడుపు కొట్టకండి:పవన్

ఆంధ్రప్రదేశ్ లోని ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆర్టీసీ పొరుగు సేవల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రతపై నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ‘సుమారు 7,600 మంది పొరుగు సేవల ఉద్యోగులు ఆర్టీసీని నమ్ముకుని జీవిస్తున్నారు. ఈ విభాగంలోకి వచ్చే ఉద్యోగుల జీతాలు రూ. 6 వేల నుంచి రూ.15 వేలు మాత్రమే. లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న […]

Written By: Neelambaram, Updated On : May 16, 2020 8:04 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆర్టీసీ పొరుగు సేవల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రతపై నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ‘సుమారు 7,600 మంది పొరుగు సేవల ఉద్యోగులు ఆర్టీసీని నమ్ముకుని జీవిస్తున్నారు. ఈ విభాగంలోకి వచ్చే ఉద్యోగుల జీతాలు రూ. 6 వేల నుంచి రూ.15 వేలు మాత్రమే. లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న కాలంలో జీతాలు చెల్లించకపోతే వారు జీవనం ఎలా సాగిస్తారు? ఈ కష్ట కాలంలో ఉద్యోగులను తొలగించొద్దు అని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణమే వేతన బకాయిలు చెల్లించి.. ఉద్యోగ భద్రత హామీని రాతపూర్వకంగా ఇవ్వాలి’ అని పవన్ ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే రాష్ట్రంలోని పండ్ల తోటల రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థిక శక్తి లేకపోయినా తోటివారిని ఆదుకోవాలనే మంచి మనసు జనసైనికుల్లో ఉందని.. జనసైనికులే పార్టీకి ఇంధనమని పవన్‌ పేర్కొన్నారు.

కరోనా సమయంలో బాధ్యతలు విస్మరించిన ప్రజాప్రతినిధుల గురించి ప్రజలకు తెలియజేయాలని పవన్‌ కళ్యాణ్ పార్టీ నేతలను కోరారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారి గురించి ఎంపీలు మాట్లాడటం లేదని పవన్‌ మండిపడ్డారు. ఎర్ర చందనం తరలిపోతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని పవన్ ప్రశ్నించారు.