https://oktelugu.com/

రోజూ కాఫీ తాగుతున్నారా.. ఆ ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్..?

రోజూ నిద్ర లేచిన వెంటనే కాఫీ తాగడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కాఫీ తాగడం వల్ల ఉత్సాహంగా ఉంటామని వేగవంతంగా పనులను పూర్తి చేయగలుగుతామని చాలామంది చెబుతూ ఉంటారు. మరి కాఫీ తాగడం వల్ల లాభమా..? నష్టమా..? అంటే అతిగా కాఫీ తాగితే మాత్రం నష్టమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీని ఎక్కువగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని వెల్లడిస్తున్నారు. Also Read: కట్టెల పొయ్యితో వంట చేస్తున్నారా.. ఆ అవయవానికి డేంజర్..? ఒక […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 24, 2020 2:05 pm
    Follow us on

    Coffee
    రోజూ నిద్ర లేచిన వెంటనే కాఫీ తాగడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కాఫీ తాగడం వల్ల ఉత్సాహంగా ఉంటామని వేగవంతంగా పనులను పూర్తి చేయగలుగుతామని చాలామంది చెబుతూ ఉంటారు. మరి కాఫీ తాగడం వల్ల లాభమా..? నష్టమా..? అంటే అతిగా కాఫీ తాగితే మాత్రం నష్టమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీని ఎక్కువగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని వెల్లడిస్తున్నారు.

    Also Read: కట్టెల పొయ్యితో వంట చేస్తున్నారా.. ఆ అవయవానికి డేంజర్..?

    ఒక అధ్యయనం ప్రకారం రోజులో రెండు కంటే ఎక్కువసార్లు కాఫీ తాగేవారిలో బద్దకం బాగా పెరిగినట్లు వెల్లడైంది. తరచూ కాఫీ తాగేవాళ్లు బీ విటమిన్ లోపంతో బాధ పడుతున్నట్టు గుర్తించామని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీలో ఉండే కెఫైన్ ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా ఉంటుందని.. కాఫీని ఎక్కువగా తాగడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాఫీలో ఉండే కార్టిసాన్ అనే హార్మోన్ ఒత్తిడి పెరగడానికి కారణమవుతుందని వెల్లడిస్తున్నారు.

    Also Read: మెంతుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

    రోజుకు రెండుసార్లు మాత్రమే కాఫీ తాగాలని అంతకు మించి తాగితే మాత్రం ఆరోగ్య సమస్యల బారిన పడక తప్పదని వైద్యులు వెల్లడిస్తున్నారు. పునరుత్పత్తి వ్యవస్థపై కాఫీ తీవ్రంగా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కొందరు ఇంట్లో కాఫీ తాగకపోయినా బయట తాగుతూ ఉంటారని పెద్దపెద్ద శబ్దాలు వింటూ కాఫీ తాగితే వినికిడి సమస్య బారిన కూడా పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

    భారీ శబ్దాలు వినిపించే చోట ఎక్కువగా పని చేసేవాళ్లు కాఫీకి గుడ్ బై చెబితే బాగుంటుందని కెనడాలోని మెక్‌గ్రిల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి వెల్లడించారు. కాఫీ తగ్గడం వల్ల కొన్ని లాభాలు ఉన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం