Pawan Kalyan Varahi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను చేస్తున్న షూటింగ్స్ అన్నిటిని పక్కన పెట్టి ఈ నెల 14 వ తారీఖు నుండి వారాహి యాత్ర ని ప్రారంభించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నేడు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో యాగం నిర్వహించాడు. ఈ యాగం తాలూకు ఫోటోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.
నిన్నటి వరకు సన్నని గెడ్డం తో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు యాగం కోసం ఆ గెడ్డం ని తీసి వేసాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న షూటింగ్స్ అన్నీ సన్నని గెడ్డం తో చేస్తున్నవే. పవన్ కళ్యాణ్ రీసెంట్ టైం లో ఇలాంటి లుక్స్ తో సినిమాలు చెయ్యలేదు. ఇక పోతే వారాహి యాత్ర ఉభయగోదావరి జిల్లాల్లో సాగబోతోంది. 24 వ తారీఖు వరకు ఈ మొదటి విడత యాత్ర ఉంటుంది.
ధర్మ పరిరక్షణ…. ప్రజా క్షేమం… సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ
యాగం చేపట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు pic.twitter.com/5k9eWS8NrJ— L.VENUGOPAL (@venupro) June 12, 2023
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోగజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఈ వారాహి టూర్ ని నిర్వహించబోతున్నారు అట. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ తో పొత్తు ఉందని అధికారికంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్, అతి త్వరలోనే ఎన్ని స్థానాల్లో పోటీ చెయ్యబోతున్నాము, ఎక్కడెక్కడ పోటీ చెయ్యబోతున్నాము అనే అంశాల పై కూడా అధికారికంగా ప్రకటించబోతున్నాడు. అంతే కాదు ఈ మొదటి విడత యాత్రలోనే పవన్ కళ్యాణ్ తాను పోటీ చెయ్యబోతున్న స్థానాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
ధర్మ పరిరక్షణ…. ప్రజా క్షేమం… సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేపట్టిన శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/LzRtobQzCC
— JanaSena Party (@JanaSenaParty) June 12, 2023
‘భీమవరం’ నుండే పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేస్తే ఈసారి రికార్డు స్థాయి మెజారిటీ తో గెలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. గతం లో పవన్ కళ్యాణ్ ఓడిపోయింది కేవలం మూడు గ్రామాల వల్ల, ఇప్పుడు ఆ గ్రామాలూ ఆయనకు బలంగా మారాయి, కచ్చితంగా ఎన్నికల సమయం లో ఇవి ఉపయోగపడొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.