Homeట్రెండింగ్ న్యూస్Tamil Nadu: ఆర్మీజవాన్ భార్యను అర్ధనగ్నంగా ఎందుకు ఊరేగించారు.? కొట్టారు.? ఏం జరిగింది?

Tamil Nadu: ఆర్మీజవాన్ భార్యను అర్ధనగ్నంగా ఎందుకు ఊరేగించారు.? కొట్టారు.? ఏం జరిగింది?

Tamil Nadu: ” నా భార్యపై 120 మంది దాడి చేశారు. అర్ధ నగ్నంగా ఊరేగించారు. నేను ఇక్కడ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాను. నా కుటుంబానికి మీరే రక్షణ కల్పించాలి” అంటూ ఆర్మీలో పని చేసే ఒక హవల్దార్ వీడియో రూపంలో చెప్పిన విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.. ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా తమిళనాడు డీజీపీకి చేరడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. దీనికి సంబంధించి జాతీయ మీడియా ఫోకస్ చేయడంతో ఈ విషయం వివాదాస్పదంగా మారింది. పైగా ఆ ఆర్మీ హవల్దార్ మాట్లాడిన వీడియోను విశ్రాంత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ త్యాగరాజన్ తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేయడంతో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు రాష్ట్రం కందవాసల్ ప్రాంతానికి చెందిన ప్రభాకరన్ అనే వ్యక్తి ఆర్మీలో హవాల్దార్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి ఒక భార్య ఉంది. ఆమె ఆ ప్రాంతంలోనే ఒక స్థలాన్ని లీజుకి తీసుకొని వ్యాపారం చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ స్థలానికి సంబంధించిన లీజు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అయితే ఆ వివాదానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ప్రభాకరన్ భార్యపై దాడి చేశారు. ఆమెను అర్ధ నగ్నంగా గ్రామంలో ఊరేగించారు.. దీనికి సంబంధించి ప్రభాకరన్ జిల్లా ఎస్పీ తో ఫోన్లో మాట్లాడారు.. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ” సార్. నేను ఆర్మీలో పని చేస్తున్నాను. 120 మంది దుండగులు నా భార్య నిర్వహిస్తున్న షాప్ మీద దాడి చేశారు. కత్తులతో బెదిరించారు. అందులో ఉన్న వస్తువులను మొత్తం ధ్వంసం చేశారు. నా కుటుంబానికి మీరే న్యాయం చేయాలి” అంటూ ప్రభాకరన్ ఒక వీడియో ద్వారా తమిళనాడు డిజిపి కి సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ పంపించారు.. దీనిని విశ్రాంత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ త్యాగరాజన్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు..

పోలీసులు ఏం చెబుతున్నారంటే

అయితే ఈ వివాదానికి సంబంధించి పోలీసులు చెబుతున్న వివరణ మరో విధంగా ఉంది. “ఈ విషయాన్ని ఆర్మీ హవాల్దార్ పెద్దదిగా చేసి చూపుతున్నారు. ప్రభాకరన్ భార్య నిర్వహిస్తున్న స్థలం ఒక దేవాలయానికి చెందింది. అందులో ఇంతకుముందు కుమార్ అనే వ్యక్తి దుకాణం నిర్వహించేవాడు. అయితే ఆ స్థలాన్ని ప్రభాకరన్ మామ 9.5 లక్షలకు లీజుకు మాట్లాడుకొని ఆ స్థలాన్ని తీసుకున్నాడు. ఆ స్థలంలో ప్రభాకరన్ భార్య దుకాణం నిర్వహిస్తోంది. ఇటీవల కుమార్ చనిపోయాడు. తమ ఆధీనంలో ఉన్న స్థలంలో దుకాణం నిర్వహించాలని కుమార్ కొడుకు రాము నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రభాకరన్ మామ(సెల్వమూర్తి) కు చెప్పాడు. దీనికి అతడు కూడా అంగీకరించాడు. అంతకముందు సెల్వమూర్తి చెల్లించిన 9.5 లక్షలను ఇచ్చేందుకు షాపు వద్దకు వచ్చాడు. ఈ నగదును సెల్వమూర్తి కుమారులు జీవా, ఉదయ్ తీసుకున్నారు. అనంతరం అతడి పై కత్తులతో దాడి చేశారు. ఆ సమయంలో ప్రభాకరన్ భార్య, అతడి అత్త షాప్ లోనే ఉన్నారు. వారిపై ఎవరూ దాడి చేయలేదు. రాముపై జీవా, ఉదయ్ దాడి చేస్తుండగా కాపాడేందుకు పక్కన ఉన్న షాపుల వారు వచ్చారు.” అని పోలీసులు చెబుతున్నారు. అయితే అదే రోజు సాయంత్రం ప్రభాకరన్ భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. ఇదే విషయాన్ని వీడియోలో పేర్కొంటూ ప్రభాకరన్ తమిళనాడు డిజిపి కి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. మరోవైపు ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ప్రభాకరన్ కు మద్దతు ప్రకటిస్తూ తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రకటన చేశారు. కాగా ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్నామని నాగపట్నం పోలీసులు చెబుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular