Pawan Kalyan: 2024 ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు వ్యూహాలు మార్చుకుంటున్నాయి. అధికారం కోసం వైఖరులు ప్రకటిస్తున్నాయి. అధికారమే పరమావధిగా కదలనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తక్కువ శాతంలో ఉన్న కమ్మ, రెడ్డి వర్గమే రాకీయాలను శాసిస్తున్నాయి. దీంతో తమకు కూడా అధికారం కావాలని కొద్ది రోజులుగా కాపు సామాజిక వర్గం కూడా పోరాడుతోంది. కానీ సరైన నేత లేకపోవడంతో వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి. గతంలో ముద్రగడ పద్మనాభం కాపు వర్గం కోసం పోరాడినా ప్రస్తుతం ఆయన మాటలను ఎవరు విశ్వసించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్న క్రమంలో పవన్ కల్యాణ్ వైపు ఓటర్లు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జనసేన సేనాని పవన్ కల్యాణ్ కాపు ఓటర్ల ప్రసన్నం కోసం పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ప్రణాళికలు రచిస్తోంది. ఇన్నాళ్లు ఓటు బ్యాంకుగా చేసుకుని పాలిస్తున్న పార్టీల గుట్టు రట్టు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్లు సరైన నేత లేకపోవడంతోనే కాపులు రాజకీయ పావులుగా మారారని తెలియజేసేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
బీజేపీతో ఉన్న సంబంధం కారణంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాపు సామాజికవర్గం ఓట్లు చీలకుండా చేసుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నారు. ఇంతకాలం మోసపోయి అన్ని రాజకీయ పార్టీలను గెలిపించినా చివరకు మిగిలింది ఏమీ లేదని కాపు ఓటర్లు తెలుసుకునేలా చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan: అధ్యక్ష అనాల్సిందే.. ఆ రెండింటిపైనే పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్
దీని కోసం సమావేశాలు నిర్వహించి రాజకీయ చైతన్యం కలిగించి వారిలో ఐక్యత సాధించే విధంగా ముందుకు వెళ్లనున్నారు. కాపు ఓటు బ్యాంకును సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలని భావిస్తున్నారు. బలమైన రాజకీయ పార్టీగా జనసేన ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేతల్లో నైరాశ్యం రాకుండా అందరిలో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు దోహదపడే కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రాంతాలేవైనా కాపులను సమీకరించడమే తమ కర్తవ్యంగా తీసుకుంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీని మట్టికరిపించేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వైసీపీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు ఎండగడుతూ తమ ప్రభావం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శాయిశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. మొత్తానికి ఏపీలో రాజకీయ సమీకరణలు మారునున్నాయని తెలుస్తోంది.
Also Read: నాటి వైభవమేదీ.. రాజులకు గడ్డుకాలం
[…] Also Read: Pawan Kalyan: కాపుల ఐక్యత కోసం పవన్ కల్యాణ్ ప్… […]
[…] Also Read: Pawan Kalyan: కాపుల ఐక్యత కోసం పవన్ కల్యాణ్ ప్… […]
[…] Also Read: Pawan Kalyan: కాపుల ఐక్యత కోసం పవన్ కల్యాణ్ ప్… […]