Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan on New Districts: లోపబూయిష్టంగా జిల్లాల పునర్విభజన.. ప్రభుత్వంపై జనసేనాని విసుర్లు

Pawan Kalyan on New Districts: లోపబూయిష్టంగా జిల్లాల పునర్విభజన.. ప్రభుత్వంపై జనసేనాని విసుర్లు

Pawan Kalyan on New Districts: జిల్లాల పునర్విభజనను ప్రభుత్వం పట్టించుకోలేదా? కొత్త జిల్లాల విషయంలో స్థానికుల అభ్యంతరాలను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందా? వేలాది డిమాండ్లు వచ్చినా.. కేవలం వైసీపీ ప్రజాప్రతినిధుల వినతులను మాత్రం సమ్మతించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తో్ంది. దీనిపై విపక్షాలు సైతం పెదవి విరుస్తున్నాయి. సోమవారం నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభమైంది. ఎక్కడికక్కడే కొత్త జిల్లాల డిమాండ్ వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు సరికదా..ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో డిమాండ్ చేస్తున్న ప్రజలను నోరు నొక్కే ప్రయత్నం చేసింది. జిల్లాల పునర్విభజనలో హేతుబద్ధత లోపించిందని.. అంతా లోపబూయిష్టంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఎక్కడా ప్రజల మనోభావాలను గౌరవించలేదని విమర్శించారు. నేతల సిఫారసులకే పెద్దపీట వేశారని ఆరోపించారు. దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. పవన్ వ్యాఖ్యలు ప్రజలకు వెళ్తే తమకు ఇబ్బందులు తప్పవని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారు. ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపడుతున్నారు. పనిలో పనిగా జిల్లాల డిమాండ్ తెరపైకి తెచ్చి.. ఆ ప్రాంత ప్రజల మనోభావాలపై మాట్లాడితే తమ పుట్టి మునగడం ఖాయమని వైసీపీ ప్రజా ప్రతినిధులు ఆందోళనతో ఉన్నారు. జిల్లాల పునర్విభజనపై కనీసం అధ్యయనం చేయకపోవడాన్ని పవన్ తప్పు పడుతున్నారు. గోదావరి జిల్లాల్లో ముంపు ప్రాంత గిరిజనుల సమస్యలను ద్రుష్టిలో పెట్టుకోకుండా జిల్లాల విభజన చేశారంటూ మండిపడ్డారు.  రంపచోడవరం ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ ను సైతం పట్టించుకోలేదన్నారు. రాయలసీమలోని మదనపల్లె, మార్కాపురం, హిందూపురంలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటించాలన్న అక్కడి స్థానికుల డిమాండ్ ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడాన్ని తప్పు పట్టారు. పవన్ తాజా వ్యాఖ్యలతో ఆయా ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను గుర్తించిన పవన్ కు ధన్యవాదాలు చెబుతున్నారు.

Pawan kalyan on AP new districts
Pawan kalyan on AP new districts

ప్రజల మనోభావాలు పట్టవా?

కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా చరిత్రలో నిలిచిపోవాలని జగన్ భావించారు. కానీ ప్రజల మనోభావాలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రను ఉదాహరణగా తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో కలపాలని భావించారు. ఇప్పటికే ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం లోక్ సభ పరిధిలో ఉండడంతో అంతా అక్కడే ఉంటుందని భావించారు. కానీ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఎచ్చెర్లను విజయనగరం జిల్లాలో కలిపితే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే మంత్రివర్గంలోకి తీసుకోలేదని మనస్తాపంతో ఉన్న ఆయన అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎచ్చెర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఉంచాలని పోరాటబాట పట్టనున్నట్టు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కొనసాగించింది. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని రాజాం అసెంబ్లీ నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో విలీనం చేసింది. రాజాం సైతం విజయనగరం లోక్ సభ పరిధిలో ఉంది. ఎచ్చెర్లకు మినహాయింపు ఇచ్చినట్టుగానే తమకు ఇవ్వాలని రాజాం వాసులు కోరారు. అయినా బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాజాంను విజయనగరం జిల్లాలో కలిపేసుకున్నారు. రాజాం నియోజకవర్గంలో తూర్పుకాపులు అధికం. భవిష్యత్ లో రాజకీయంగా చక్రం తిప్పవచ్చని బొత్స భావించారు. అందులో భాగంగానే రాజాంను విజయనగరం జిల్లాలో కలపడంలో సఫలీక్రుతమయ్యారు. నాయకుల సిఫారసులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం.. ఐక్య కార్చాచరణ కమిటీల అభ్యంతరాలను పట్టించుకోలేదు.

Also Read: మరో రెండు రోజుల తరువాతే..ఏపీలో ఉద్యోగులకు జీతాలు

పెద్ద మతలబే

కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక పెద్ద మతలబే నడిచింది. కేవలం రాజకీయంగా పట్టు నిలుపుకునేందుకు వీలుగా జగన్ సర్కారు సరికొత్త ప్రయోగం చేసింది. పాత జిల్లాల్లో చాలామంది సీనియర్లు పాతకుపోయారు. పార్టీలో ఇతర నేతలను ఎదగనివ్వకుండా చేస్తూ వస్తున్నారు. పైగా అధిష్టానికి ఒకరకమైన బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నారు. దీంతో జిల్లాల విభజన ద్వరా అటువంటి నేతలకు చెక్ చెప్పొచ్చని ప్రభుత్వం భావిస్తొంది. చిన్న జిల్లాలైతే నాయకులు పట్టు జారుకునే అవకాశమే లేదని ..అ దే పెద్ద జిల్లాలైతే గ్రూపు రాజకీయాలకు అవకాశం ఉంటుందని భావించి పక్కా ప్రణాళికతో పునర్విభజన చేపట్టింది. కొత్త జిల్లాలను ప్రకటించింది. అయితే దీనిపై జనసేనాని విమర్షలకు దిగుతుండడం ప్రభుత్వ పెద్దలకు మింగుడు పడడం లేదు. ఇదే అంశంతో ఆయన ప్రజల్లోకి వెళ్తే జిల్లాలపై సెంటిమెంట్ పెరిగే అవకాశముందని.. అది ప్రభుత్వ మెడకు చుట్టుకోవడం ఖాయమని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.

Also Read: మెగా ఫ్యామిలీకి ‘ఏపీ ఆన్ లైన్ టికెట్’ టెండర్ ఎందుకు ఆపేశారు?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version