Prabhas and Maruthi Movie: నేషనల్ స్టార్ అని ప్రభాస్ తన పేరుకు ముందు ఊరికే గొప్ప కోసం పేరు వేసుకోలేదు. నిజంగా.. ప్రభాస్ కి ప్రస్తుతం 300 కోట్లు మార్కెట్ ఉంది. అందుకే.. ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు మారుతితో ప్రభాస్ ఒక సినిమా చేయాలనుకోవడం.. పైగా అది కూడా పాన్ ఇండియా సినిమా చేయాలనుకోవడం షాకింగ్ నిర్ణయమే.

అసలు ఈ సినిమా మధ్యలోనే ఆగిపోతే బాగుండు అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా బలంగా కోరుకుంటున్నారు. కానీ.. ఈ సినిమా స్టార్ట్ కాబోతుంది. ఏప్రిల్ 10న ఈ సినిమా హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలుకానుంది. ఇప్పటికే మారుతి ఈ సినిమా కోసం అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించడానికి సన్నద్ధం అయ్యాడు.
ఇక ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని.. సబ్జెక్ట్ కూడా చాలా కొత్తగా ఉండబోతుంది అని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అన్నట్టు ప్రస్తుతానికి అయితే.. ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
Also Read: షాకింగ్.. ఇది తెలుగు వాడి సింహ గర్జన !
ప్రభాస్ మారుతితో ఈ సినిమా చేయడానికి సైన్ చేయకముందు ఒక కండీషన్ పెట్టాడు. సినిమాని మూడు నెలల్లో ఫినిష్ చేయాలనేది ఆ కండిషన్. ఎలాగూ మారుతి ఏమి చేసినా బిజినెస్ పరంగా మంచి లాభాలు వచ్చే విధంగా చేస్తాడు. పైగా నిర్మాతలకు లాభాలు వచ్చే సినిమాలే చేస్తాడు. అందుకే.. ప్రభాస్ షరతుకు మారుతి కూడా అన్ని రకాలుగా అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా కింద స్థాయి నుంచి రావడంతో మారుతికి మాస్ పల్స్ బాగా తెలుసు. డైరెక్టర్ గా కూడా మారుతి బాగా సక్సెస్ అయ్యాడు. కాకపోతే, ఇప్పటివరకు ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వలేదు. ఒక్క వెంకటేష్ మాత్రమే డేట్స్ ఇచ్చాడు. కానీ, వెంకీతో మారుతి పెద్ద డిజాస్టర్ చేశాడు. అయితే, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో భారీ విజయం సాధించి మొత్తానికి తనలో మ్యాటర్ ఉందని బలంగా నిరూపించుకున్నాడు. అందుకే, ప్రభాస్ డేట్లు ఇచ్చినట్టు ఉన్నాడు.
Also Read: నీ ఓవరాక్షన్ ఆపు.. నీ వ్యవహారం మాకు తెలుసు
[…] Also Read: ‘ప్రభాస్’ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. … […]