KTR and Bandi Sanjay War: కంటోన్మెంట్ వార్: టచ్ చేసి చూస్తే కేటీఆర్ కు చుక్కలేనంటున్న ‘బండి’

KTR and Bandi Sanjay War: తెలంగాణలో రాజకీయ విభేదాలు ముదురుతున్నాయి. కొద్ది రోజులుగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న వ్యవహారం ఇప్పుడు ముదురుతోంది. తాజాగా కంటోన్మెంట్ కు కరెండ్, నీళ్లు కట్ చేస్తామని రాష్ర్ట పురపాలక, ఐటీ శాఖ మంత్రి తారకరామారావు వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మండి పడుతున్నారు. దమ్ముంటే కంటోన్మెంట్ మీద చేయి వేసి చూడాలని సవాలు విసిరారు. అయ్య, కొడుకు జాగీరులా ఫీలవుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కు […]

Written By: Srinivas, Updated On : March 14, 2022 10:23 am
Follow us on

KTR and Bandi Sanjay War: తెలంగాణలో రాజకీయ విభేదాలు ముదురుతున్నాయి. కొద్ది రోజులుగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న వ్యవహారం ఇప్పుడు ముదురుతోంది. తాజాగా కంటోన్మెంట్ కు కరెండ్, నీళ్లు కట్ చేస్తామని రాష్ర్ట పురపాలక, ఐటీ శాఖ మంత్రి తారకరామారావు వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మండి పడుతున్నారు. దమ్ముంటే కంటోన్మెంట్ మీద చేయి వేసి చూడాలని సవాలు విసిరారు. అయ్య, కొడుకు జాగీరులా ఫీలవుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కు నూకలు చెల్లాయని అందుకే వివాదాల్లో వేలు పెడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పేర్కొంటున్నారు.

KTR and Bandi Sanjay War

కొన్నాళ్లుగా కంటోన్మెంట్ విషయంలో రెండు పార్టీల మధ్య లొల్లి జరుగుతూనే ఉంది. కంటోన్మెంట్ లో అభివృద్ది లేదని చెబుతూ టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ పై ఎందుకు టీఆర్ఎస్ కు దృష్టి తన పరిధిలో ఉన్న ప్రాంతాలను చూసుకోవాలని బీజేపీ హితవు పలుకుతోంది. దీంతో దీని విషయంలో పలుమార్లు దుమ్ములేపే మాటలు సైతం వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరోమారు కంటోన్మెంట్ ప్రాంతం వివాదాల్లోకి వస్తోంది.

Also Read: చార్మినార్‌పై క‌విత బ‌ర్త్ డే ఫ్లెక్సీ వివాదం.. ఆ ఏరియా అధ్య‌క్షుడిపై కేసు..

ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య అగాధం పెరిగిపోయింది. మరోవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే వాదన విస్తరిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతోంది. తన పతనం ఇక్కడే ప్రారంభమవుతుందని భావించి బీజేపీని ఎలాగైనా ఎదుర్కోవాలనే ఉధ్దేశంతోనే ఇలా బంక రంకుల వేషాలు వేస్తోందని బండి సంజయ్ ధ్వజమెత్తుతున్నారు. కావాలంటే మీ పరిధిలోని ప్రాంతాల్లో పనులు చేసుకో కానీ కేంద్ర పరిధిలో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతాన్ని టచ్ చేస్తా అంటే చూడా ఏమవుతుందో తెలుస్తుంది అని బదులిచ్చారు.

దీంతో మరోమారు కేటీఆర్, సంజయ్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కంటోన్మెంట్ ప్రాంతమంటే మీ జాగీరు కాదు. దమ్ముంటే పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేసుకో కానీ కంటోన్మెంట్ ప్రాంతాన్ని టచ్ చేస్తే పరిస్థితులు వేరే ఉంటాయని హెచ్చరించారు. దీంతో రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వం మధ్య కంటోన్మెంట్ ప్రాంతం గొడవ కొద్ది కాలంగా రగులుతూనే ఉంది. పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుంటే దాని జోలికి వస్తే ఊరుకునేది లేదని తెగేసి చెబుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎటు దారి తీస్తాయో చెప్పలేకుండా ఉంది.

Also Read: కేసీఆర్ సార్ ప్రకటన అయిపాయే.. నోటిఫికేషన్లు ఎప్పుడు సార్?

Tags