Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సాగు విస్తరిస్తోంది. వైసీపీ పాలనలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్తుతోంది. దీనిపై ఇటీవల కాలంలో ప్రతిపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ, ఒడిశా సరిహద్దులో ఉన్న ప్రాంతాల గుండా వ్యాపారం కొనసాగుతోందని తెలుస్తోంది, ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ తీరుపై ఆక్షేపణలు చేశారు. రాష్ర్టంలో గంజాయి సాగు విస్తరిస్తూ ప్రజలను మత్తులోకి నెడుతోందని చెబుతున్నారు.

వైసీపీ హయాంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. మద్యం విక్రయాలపై అదుపు లేకుండా పోతోంది. గంజాయి, గుడుంబా విచ్చలవిడిగా దొరుకుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల కనుసన్నల్లోనే వ్యాపారం కొనసాగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. దొరికిన కాడల్లా ప్రభుత్వ భూములను అమ్మేస్తూ అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు రాజధానుల విషయం అటకెక్కింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అది సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవోగా అభివర్ణించారు.
దీంతో రాష్ర్టంలో పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతోంది. ప్రతిపక్షాలు గోల చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. ఒక పంట కాలంలో దాదాపు నాలుగు వేల టన్నుల గంజాయి బయటకు వెళ్తుందని తెలుస్తోంది. ప్రభుత్వం గంజాయి వ్యాపారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని గోల చేస్తున్నా వినిపించుకోవడం లేదు. ఫలితంగా గంజాయి సాగుపై మాట్లాడినా అది వృథాయే అవుతున్నట్లు చెబుతున్నారు. జనసేన పార్టీ నేతలను రెచ్చగొడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామన్నారు.
Also Read: Huzurabad Bypoll Results: మినీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్.. ఏం సంకేతాలిస్తున్నాయి?
రాష్ర్టంలో చోటుచేసుకున్న పరిణామాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భావాల్ని వ్యక్తీకరించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు. కార్యకర్తలక దిశానిర్దేశం చేస్తున్నారు. అధికార పార్టీకి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల నాయకులను సిద్ధం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు తగిన విధంగా రెడీ కావాలని చెబుతున్నారు.