జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటారనే దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కమలంతోనే ఉంటారా లేక వేరే పార్టీకి మద్దతు ఇస్తారా అనే విషయం ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీతో సంబంధాలు తెంచుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సహకరించినా తనను, కార్యకర్తలను అవమానించారని పవన్ వాపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిచ్చారు.
ఏపీలో సైతం…
ఇక ఏఫీలో సైతం తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన మద్దతిచ్చినా అపజయం కావడంతో అక్కడి బీజేపీ నేతలు పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ఓడిపోయామని చెప్పడంపై కినుక వహించినట్లు తెలిసింది. దీంతో ఆయన బీజేపీతో సంబంధాలు తెంచుకోనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై కార్యకర్తలతో మాట్లాడారని చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ మద్దతు ఎటు వైపు ఉంటుందోనని పలువురు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ తో..
పవన్ కల్యాణ్ తో పని చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఏపీలో పవన్ కల్యాణ్ తో లేకపోవడంతో విజయం సాధించలేకపోయామని టీడీపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారో నని అందరూ ఎదురు చూస్తున్నారు. జనసేన పార్టీ మద్దతు ఇస్తే విజయం దక్కుతుందని భావిస్తున్న వారికి ఆ పార్టీపై విశ్వాసం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఎంత మేరకు ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికలే..
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. దీంతో పవన్ కల్యాణ్ మద్దతు ఎవరికి ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మద్దతు ఎవరిపై ఉంటుందోనని తెలుస్తోంది. భారీగా సమీకరణలు మారే అవకాశం ఉంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. మొత్తానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో కీ రోల్ పోషించే అవకాశం ఉంది. పవన్ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగాఉన్న ఎవరు ఉపయోగించుకుంటారో వేచి చూడాల్సిందే.