https://oktelugu.com/

ప్చ్.. ఈ లెక్కన చరణ్ తో ఇప్పట్లో లేనట్లే !

విజువల్ ఇంద్రజాలికుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు అనగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులను పరిశీలిస్తే.. ఈ సినిమా ఇప్పట్లో మొదలు కావడం అనేది కష్టమే. ఎందుకంటే ‘భారతీయుడు 2’ సినిమా పూర్తి చేయకుండా శంకర్, మరో సినిమా మొదలు పెడితే లీగల్ గా ఆయనకు చాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ‘లైకా ప్రొడక్షన్స్’ అనే నిర్మాణ సంస్థ అంటే ఏదో […]

Written By:
  • admin
  • , Updated On : May 16, 2021 / 04:47 PM IST
    Follow us on

    విజువల్ ఇంద్రజాలికుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు అనగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులను పరిశీలిస్తే.. ఈ సినిమా ఇప్పట్లో మొదలు కావడం అనేది కష్టమే. ఎందుకంటే ‘భారతీయుడు 2’ సినిమా పూర్తి చేయకుండా శంకర్, మరో సినిమా మొదలు పెడితే లీగల్ గా ఆయనకు చాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

    ‘లైకా ప్రొడక్షన్స్’ అనే నిర్మాణ సంస్థ అంటే ఏదో రెగ్యులర్ సినిమా కంపెనీ కాదు, ఆ సంస్థ పెద్ద కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది. అన్ని పర్ఫెక్ట్ అగ్రిమెంట్స్ ఉంటాయి. శంకర్ గొప్ప దర్శకుడు కావొచ్చు, కానీ మాకేంటి అనేలా ఉంది లైకా వ్యవహార శైలి. నిజానికి ఇప్పటికే ఈ సంస్థ శంకర్ తో “2.0” సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రస్తుతం ‘భారతీయుడు 2’ కూడా భారీగానే నిర్మిస్తోంది.

    కానీ కమల్ హాసన్ మీద అంత బడ్జెట్ అవసరమా ? అసలుకే శంకర్ కూడా ప్లాప్ లో ఉన్నాడు కదా ? ఇలాంటి డౌట్లు పెరగడంతో లైకా వారు ఈ సినిమాకి బడ్జెట్ తగ్గించారు. అది అవమానంగా భావించిన శంకర్, మొత్తానికి ఆ సినిమాని మధ్యలోనే ఆపేశాడు. అయితే, ఇప్పటివరకు ఈ సినిమాకి 160 కోట్లు ఖర్చుపెట్టిందని లైకా పక్కా లెక్కలు చూపిస్తోంది. ఈ లెక్కలు కూడా ఆ సంస్థకి శంకర్ కి మధ్య విభేదాలను పెంచింది.

    దాంతో శంకర్ తెలివిగా ‘భారతీయుడు 2’ని పక్కన పెట్టి, టాలీవుడ్ లో చరణ్ తో సినిమాని సెట్ చేసుకున్నాడు. అలాగే రణ్వీర్ సింగ్ హీరోగా హిందీలో ‘అపరిచితుడు’ను రీమేక్ చేయబోతున్నాను అని సినిమాని కూడా అనౌన్స్ చేశాడు శంకర్. అయితే లైకా సంస్థ కూడా తెలివిగా కోర్టుకు వెళ్ళింది. కోర్టు శంకర్ దూకుడుకు బ్రేకులు వేసేలా ఉంది. కాబట్టి ‘భారతీయుడు 2’ సినిమాపై ఇప్పటివరకు పెట్టిన 160 కోట్ల రూపాయలు అయినా శంకర్ తిరిగి లైకాకి చెల్లించాలి. లేదా సినిమాని అయినా కచ్చితంగా పూర్తి చెయ్యాలి. ఆ తరువాత మరో సినిమా గురించి ఆలోచించుకోవాలి. ఈ లెక్కన శంకర్ – చరణ్ సినిమా ఇప్పట్లో లేనట్లే.