https://oktelugu.com/

నేనే కనుక సీఎం అయితే.. పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో వైసీపీలో అలజడి

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అవి అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఒకవేళ ఆయన జైలుకెళ్తే తదుపరి నాయకత్వం కోసం ఇప్పటి నుంచి పార్టీలో అంతర్గత సంక్షోభం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ చానల్‌లో సంచలనాత్మక కథనం ప్రసారం కావడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీన్ని చూసి జగన్ మోహన్ రెడ్డి తరపున అన్ని పనులు చేసే సజ్జల రామకృష్ణారెడ్డి ఉలిక్కి పడి మీడియా ముందుకు వచ్చారు. అలాంటిదేమీ లేదన్నారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 10, 2021 / 12:51 PM IST
    Follow us on


    ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అవి అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఒకవేళ ఆయన జైలుకెళ్తే తదుపరి నాయకత్వం కోసం ఇప్పటి నుంచి పార్టీలో అంతర్గత సంక్షోభం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ చానల్‌లో సంచలనాత్మక కథనం ప్రసారం కావడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీన్ని చూసి జగన్ మోహన్ రెడ్డి తరపున అన్ని పనులు చేసే సజ్జల రామకృష్ణారెడ్డి ఉలిక్కి పడి మీడియా ముందుకు వచ్చారు. అలాంటిదేమీ లేదన్నారు. కానీ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటలు మరోసారి ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కల్పించడానికి కారణమయ్యాయి.

    Also Read: తెలంగాణ ఉద్యోగులకు 29 శాతం ఫిట్‌మెంట్‌.. కేసీఆర్‌‌ వ్యూహం ఏంటి..?

    తన శాఖ పని తీరు గురించి చెప్పడానికి ఎప్పుడూ లేని విధంగా ప్రెస్‌మీట్ పెట్టిన పెద్దిరెడ్డి ‘నేను కానీ ముఖ్యమంత్రిని అయి ఉంటే..’ అనే డైలాగ్ వాడారు. పెద్దిరెడ్డి మాటలు విని వైసీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. జగన్మోహన్ రెడ్డి కాబట్టి.. టీడీపీ ఎమ్మెల్యేలు కొంత మందిని లాగలేకపోయారని.. అదే తాను ముఖ్యమంత్రిని అయి ఉంటే ఒక్క చంద్రబాబు మినహా అందర్నీ వైసీపీలో చేర్పించేసి ఉండేవాడినని చెప్పుకొచ్చారు. ఆయన వీరత్వం తర్వాత సంగతి కానీ.. అసలు జగన్మోహన్ రెడ్డికి బదులు తానే సీఎం అన్న ఆలోచన వచ్చినా.. వైసీపీ వారికి నిలువ నీడ కూడా ఉండదు.

    అలాంటిది.. జగన్మోహన్ రెడ్డికి బదులుగా తానే ముఖ్యమంత్రి అని పెద్దిరెడ్డి ధైర్యంగా ప్రకటన చేయడం అంటే..మామూలు విషయం కాదంటున్నారు. అసలు అలాంటి ఆలోచనే పార్టీ నేతలకు రాకూడదు. కానీ.. పెద్దిరెడ్డికి వచ్చింది. రావడమే కాదు.. తాను జగన్ కంటే గొప్పగా రాజకీయం చేస్తానని కూడా చెప్పుకుంటున్నారు. ఇదంతా ఆషామాషీగా అన్న మాటలు కాదని.. ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే అన్నారని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

    Also Read: కార్పొరేట్లకు మోడీ దోచిపెట్టిన సొమ్ము ఎంతో తెలుసా?

    ఆ టీవీ చానల్‌లో వచ్చిన కథనం ఆ వెంటనే పెద్దిరెడ్డి మాటలు ఇప్పుడు పోల్చి చూసుకుని కలిపేసుకుని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. చాలా రోజులుగా జగన్ జైలుకెళ్తే సీఎం పదవి పొందాలన్న పట్టుదలతో రాయలసీమ నుంచి పెద్దిరెడ్డి.. ఉత్తరాంధ్ర నుంచి బొత్స ఉన్నారన్న రూమర్స్ బలంగానే ఉన్నాయి. దానికి తగ్గట్లుగా ఇప్పుడు పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారు. అనూహ్యంగా ఇప్పుడు.. జగన్ జైలుకెళ్లే టాపిక్ పై చర్చ ఎక్కువ కావడం వైసీపీ నేతలను గందరగోళంలోకి నెట్టుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్