Pawan Kalyan- Jagan: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే అధికార వైసీపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జనసేనాని దూకుడుకు కల్లెం వేసేందుకు అధికార పార్టీ అంగబలం ఉపయోగిస్తోంది. ఇటీవల విశాఖలో జనసేనాని నిర్బంధం, ఇప్పటంలో పోలీసులతో అడుగడుగునా అడ్డంకులు, ఆటంకాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటన సందర్భంగా పీఎం ఆఫీస్ నుంచి జనసేన అధినేత పవన్‌కు పిలుపు రావడం జగన్‌ను షాక్‌కు గురిచేసింది.

ప్రధానితో పవన్ ప్రత్యేక భేటీ..
ఆంధ్రప్రదేశ్‌లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందకు వచ్చిన ప్రధాని మోదీ.. పవన్‌ను ప్రత్యేకంగా భేటీ కావడం.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ.. సుమారు గంటపాటు జనసేనానితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రాలో రాజకీయాలోతోపాటు, అభివృద్ధి, బీజేపీ–జనసేన మైత్రిపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలకు సంబంధించి ప్రధాని మోదీ పవన్‌కు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. భేటీ అనంతరం బయటకు వచ్చిన పవన్ మంచి రోజులు రాబోతున్నాయని ప్రకటించారు. మిగతా విషయాలన్నీ త్వరలోనే చెబుతానని తెలిపారు.

షాక్‌లో జగన్..
అధికారిక కార్యక్రమాలకు వచ్చిన మోదీ తన శత్రువైన పవన్‌తో భేటీకి టైం ఇవ్వడమే ఏపీ సీఎం జగన్‌ను షాక్ గురిచేసింది. షెడ్యూల్ ప్రకారం పవన్–మోదీ భేటీ పది నిమిషాలే జరగాలి. కానీ పవన్‌తో మోదీ గంట సేపు సమావేశం కావడం ఇప్పుడు అధికార వైసీపీని మరింత షాక్‌కు గురిచేసింది. పవన్ మ్యానియాతోనే ప్రధాని మోదీ జనసేనానితో అంతసేపు భేటీ ఆయ్యారని జన సైనికులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పవన్ – ప్రధాని మధ్య జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఏం చర్చించారని అధికార వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు పవన్ బయటకు వచ్చి.. కుషీగా కనిపించడం.. మంచి రోజులు రాబోతున్నాయని ప్రనకటించడంలో ఆంతర్యం ఏమిటని ఆరా తీస్తోంది అధికార వైసీపీ. మరోవైపు పవన్‌కు ప్రధాని వద్ద ఉన్న క్రేజీని చూసి జగన్ షాక్‌లో ఉన్నారని జన సైనికులు పేర్కొంటున్నారు.