Pawan Kalyan- Garuda Puranam Sivaji: గరుడపురాణం.. ఇదేదో పురాణాలకు సంబంధించిది కాదు.. గత ఎన్నికల ముందు ఏపీలో నటుడు శివాజీ చెప్పిన గరుడ పురాణం స్టోరీ. అప్పుడు మీడియా ముందుకొచ్చి ఒక బోర్డు మీద శివాజీ ఏపీలో జరుగుతున్న రాజకీయ కుట్రలు అంటూ ఒక గరుడ పురాణం చెప్పిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఉన్న ఒక పార్టీ.. ఏపీని దక్కించుకోవడం కోసం కొత్త ఎత్తులతో వస్తుందనేది శివాజీ కాన్సెప్ట్. అప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని అందరూ కామెడీగా చూశారు. కానీ ఇప్పుడు అదే వీడియో ఏపీని షేక్ చేస్తోంది. గరుడ పురాణంలో శివాజీ చెప్పినట్లే ఏపీలో రాజకీయం జరుగుతోంది.

విశాఖ ఉక్కుపై శివాజీ చెప్పింది యాజిటీజ్‌గా..
వాస్తవానికి శివాజీ 2014 ఎన్నిలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. తర్వాత ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రాపై కుట్రలు జరుగుతున్నాయని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, బీజేపీ నేతలు కలిసి పోయారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. ఇలా రోజుకొక అంశంతో మీడియా ముందుకు వచ్చేవారు. దీంతో శివాజీ అసలు బీజేపీ సభ్యుడే కాదని అధిష్టానం తేల్చి చెప్పింది. ఆ తర్వాత చంద్రబాబుపై సుతిమెత్తని విమర్శలు చేసినా.. అంతిమంగా ఏపీకి ఆయన నాయకత్వం అయితేనే బాగుంటుందనేలా శివాజీ మాట్లాడే వారు. దీంతో వైసీపీ శ్రేణులు శివాజీపై కుల ముద్ర వేసి.. కులాజీ, గరుడ పురాణం అంటూ కామెడీ చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాలను సైతం రచ్చ చేశారు. అయినా కూడా, శివాజీ వీటన్నింటినీ లెక్కచేయకుండా ఆంధ్రప్రదేశ్‌పై ఢిల్లీ పెద్దలు చేసే కుట్రలు చేస్తున్నారంటూ బోర్డుపై ఉదాహరణలతో వివరించేవారు. భవిష్యత్తులో ఇలా జరగబోతుంది.. ఫలానా వ్యక్తిపై దాడి చేస్తారు, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తారు, జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారు, తర్వాత ఆయన్ను జైల్లో వేసి బీజేపీ నాయకుడు సీఎం అవుతారు అంటూ అప్పట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కానీ, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించి జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శివాజీ కాస్త, సైలెంట్ అయిపోయారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత శివాజీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఏడాది తర్వాత ప్రకంపనలు రేపుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని 100 శాతం ప్రైవేటు పరం చేయాలని యోచిస్తున్న తరుణంలో 2020 జనవరిలో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆ వీడియోలో విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయబోతున్నారని శివాజీ వెల్లడించారు. ఈ విషయం ఎవరికీ తెలియదని, తాను ఇప్పుడు చెబుతున్న మాటల్ని రాసిపెట్టుకోండని సంచలన విషయాలు వెల్లడించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని ఏమీ చెయ్యలేరని, అంతా ముందే డిసైడ్ అయిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఊపందుకున్న తరుణంలో ఏడాది మందు నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

నెక్ట్స్ సీఎం పవన్..
ఇక శివాజీ గరుడ పురాణం ప్రకారం ఢిల్లీ నుంచి ఓ పార్టీ వస్తుందని, జగన్‌ను జైలుకు పంపుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గరుడ పురాణం నిజమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్ కుడి భుజం విజయసాయిరెడ్డిపై అనేక కేసులు నమోదవుతున్నాయి. ఆయన అల్లుడు ఢిల్లీ లిక్కిర్ స్కాం కేసులో రెండు రోజుల క్రితం అరెస్ట్ అయ్యాడు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చారు. జనసేన పార్టీలో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మంచి రోజులు రాబోతున్నాయని ప్రధానితో భేటీ అనంతరం పవన్ ప్రకటించారు. దీంతో గరుడ పురాణం ప్రకారం ఢిల్లీకి చెందిన బీజేపీ పార్టీ సహకారంతో ఏపీలో పవన్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. అది జరిగే ముందు.. జగన్ జైలుకు వెళతాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీకి నెక్ట్స్ సీఎం పవనే అని అంటున్నారు.