https://oktelugu.com/

Pavan Kalyan Tirupati: పవన్ కల్యాణ్ ఇక అక్కడి నుంచే పోటీ..: తీర్మానం జరిగిపోయింది..

Pavan Kalyan Tirupati: జనసేనాని పవన్ కళ్యాణ్ తీరని కోరిక ‘ఎమ్మెల్యేగా గెలవడం’. పోయిన సారి రెండు చోట్ల పోటీచేసినా వైసీపీ కుట్రలు, కుతంత్రాలు.. వందల కోట్లు డబ్బు కుమ్మరించి ఓట్లు కొనిపించి మరీ పవన్ ను కక్ష గట్టి ఓడించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీలోనే అత్యధికంగా పవన్ కళ్యాణ్ పోటీచేసిన నియోజకవర్గాల్లో డబ్బు, మద్యం ఏరులై పారిందన్న విమర్శలు వచ్చాయి. కానీ పవన్ వెన్నుచూపలేదు.. వెనకడుగు వేయలేదు. ప్రజల కోసమే పోరాడుతున్నారు. ప్రజల్లోనే ఉంటున్నాడు. ఈసారి […]

Written By: NARESH, Updated On : May 31, 2022 11:18 am
Follow us on

Pavan Kalyan Tirupati: జనసేనాని పవన్ కళ్యాణ్ తీరని కోరిక ‘ఎమ్మెల్యేగా గెలవడం’. పోయిన సారి రెండు చోట్ల పోటీచేసినా వైసీపీ కుట్రలు, కుతంత్రాలు.. వందల కోట్లు డబ్బు కుమ్మరించి ఓట్లు కొనిపించి మరీ పవన్ ను కక్ష గట్టి ఓడించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీలోనే అత్యధికంగా పవన్ కళ్యాణ్ పోటీచేసిన నియోజకవర్గాల్లో డబ్బు, మద్యం ఏరులై పారిందన్న విమర్శలు వచ్చాయి. కానీ పవన్ వెన్నుచూపలేదు.. వెనకడుగు వేయలేదు. ప్రజల కోసమే పోరాడుతున్నారు. ప్రజల్లోనే ఉంటున్నాడు. ఈసారి వెన్నుచూపని నియోజకవర్గాన్ని ఎంచుకొని పోటీచేయాలని భావిస్తున్నాడు. ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్ కు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. వాళ్లంతా అక్కడి నుంచే పోటీచేయాలని గెలిపించుకుంటామని తీర్మానించారు. పవన్ కు ఆ నియోజకవర్గ సెంటిమెంట్ ఉంది. అన్నయ్య చిరంజీవిని అక్కడి ప్రజలు గెలిపించారు. అందుకే పవన్ పోటీచేసే నియోజకవర్గం ఇప్పుడు జనసేనకు దొరికినట్టైందన్న టాక్ వినిపిస్తోంది.

Pavan Kalyan Tirupati

Pavan Kalyan

ఏపీలో వచ్చేసారి అధికారమే లక్ష్యంగా జనసేన పావులు కదుపుతోంది. పవన్ కళ్యాన్ ను సీఎం చేయడమే ఆశయంగా బీజేపీ ఎత్తులు వేస్తోంది. ప్రతిపక్ష టీడీపీ రోజురోజుకు దిగజారుతున్న వేళ ఈ అవకాశాన్ని జనసేన చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇదే అదనుగా ప్రజల్లోకి వెళ్లి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడాలని చూస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకుంది. గట్టిగా మరో సంవత్సరం ప్రభుత్వ కార్యకలాపాలు సాగించి.. ఆ తరువాత ఎన్నికల్లోకి వెళ్లడమే. దీంతో పవన్ సైన్యం ఇప్పటి నుంచే అప్రమత్తమవుతోంది. 2024 ఎన్నికల కోసం అప్పుడే ప్రణాళికలు వేస్తున్నారు. ఇంతకాలం పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారా..? అనే చర్చ సాగింది. ఈ నేపథ్యంలో తమ అధినేత పవన్ ను తిరుపతి నుంచి పోటీ చేయాలని జనసైనికులు కోరుతున్నారు. తాజాగా ఏర్పడిన తిరుపతి పట్టణ నూతన కమిటి పవన్ కళ్యాణ్ ఇక్కడే పోటీ చేయాలని తీర్మానించింది. అయితే పవన్ ను తిరుపతి నుంచి పోటీ చేయాలని కోరడానికి పెద్ద కారణమే ఉందని అంటున్నారు.

Also Read: MLC Duvvada Srinivas- Atchannaidu: అచ్చెన్నాయుడును రోడ్లపై ఈడ్చి కొడతా.. ఎమ్మెల్సీ దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలోనే ప్రారంభించారు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో తిరుపతితో పాటు పాలకొల్లు లో పోటీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు ఆయన సొంత ఊరు అయినందున ఇక్కడ పోటీ చేయాల్సి వచ్చింది. అయితే పాలకొల్లులో ఓడిపోయారు. కానీ తిరుపతిలో గెలిచారు. చిరంజీవి ఇక్కడ గెలవడానికి ఆయన సామాజిక వర్గమే కారణమని అన్నారు. ఏదీ ఏమైనా ఇక్కడ గెలిచి అసెంబ్లీలో అధ్యక్ష అనేశారు. ఆ తరువాత చిరు రాజకీయాల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

ఇక పవన్ 2019లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాల్లో ఇవన్నీ కామనే అని భావించిన పవన్ అప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. రైతు సమస్యల నుంచి రోడ్ల సమస్యల వరకూ ప్రజలందరి తరుఫున ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ కొనసాగుతోంది. కానీ కొన్ని రోజులుగా తమ్ముళ్ల హడావుడి కనిపించడం లేదు. మరోవైపు జనసేన ప్రజల్లోకి దూసుకు పోతుంది. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు కోసం టీడీపీ నాయకులు వెంటపడుతుండడం విశేషం. ఇదే అదనుగా వైసీపీకి ప్రధాన పోటీదారుగా నిలవాలన్నది జనసైనికుల లక్ష్యం.

Pavan Kalyan Tirupati

Pavan Kalyan

దీంతో ఇప్పటి నుంచే 2024 ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించారు. అయితే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని జనసైనికులు కుతూహలంతో ఉన్నారు. గతంలో జరిగిన పరాభావం మరోసారి జరగకుండా చూడాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా పవన్ ను తిరుపతి నుంచి పోటీ చేయాలని తీర్మానం చేశారు. తిరుపతి నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గం బలంగా ఉండడం వల్ల పవన్ ను లక్ష మెజారిటీతో గెలిపిస్తాని ఇప్పటి నుంచే హామీ ఇస్తున్నారట. ఇప్పుడున్న వైసీపీకి ఇక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, దీంతో పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే కలిసొస్తుందని అంటున్నారు.

అయితే ఒకప్పుడు చిరు విషయంలో జరిగిందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జరుగుతుందా? అన్నది జనసేన బేరీజు వేస్తోంది. పవన్ గెలుపునకు సామాజిక వర్గం కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో వైసీపీ జోరు చూపించింది. ఈ నేపథ్యంలో పవన్ అంత మెజారిటీ తెచ్చుకుంటాడా..? లేదా అన్నది విశ్లేషించుకుంటున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తనకు అనుకూలమైన తిరుపతి నియోజకవర్గాన్ని విడిచిపెడుతుందా..? లేదా అన్నది డౌట్. మరోవైపు పొత్తులో బీజేపీ ఉంటే ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుపతి సీటును జనసేనకు వదులుకునే అవకాశం ఉండదని చర్చించుకుంటున్నారు. మరీ జనసేన అధినేత తమ సైనికుల మాట వింటాడా..? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటాడా..? అనేది చూడాలి.

Also Read:Internet Cut In Konaseema: కోనసీమలో ఇంటర్నెట్ కట్.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల అవస్థలు అంతా ఇంతాకాదు..

Tags