MLC Duvvada Srinivas- Atchannaidu: ‘అరే దున్నపోతు నిన్ను తన్నాలంటే మాకు ఒక నిమిషం పట్టదు. ఈ రోజు చెబుతున్నా.. ఆహుతి సినిమాలో విలన్‌కు ఎలాగైతే ఈడ్చిఈడ్చి కొట్టారో అలాగే నిన్ను నడి రోడ్డుపై తీసుకెళ్తా. ఇదే నా సవాల్’.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడ్ని ఉద్దేశించి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలివి. అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నారు. అదే నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జిగా దువ్వాడ శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు.
గడిచిన ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పోటీచేసిన దువ్వాడ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓటమి చవిచూశారు. నోరున్న నేతగా, దూకుడు స్వభావం కలిగిన నాయకుడిగా పేరున్న దువ్వాడ వైసీపీ అధినేత ద్రుష్టిలో పడ్డారు. ఎలాగైనా అచ్చెన్నను ఎదుర్కోవాలన్న ఉద్దేశ్యంతో దువ్వాడను ప్రోత్సహిస్తూ వచ్చారు. అప్పటి వరకూ టెక్కలి నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న పేరాడ తిలక్ ను తప్పించి దువ్వాడకు అప్పగించారు. అప్పటి నుంచి దువ్వాడ కింజరాపు కుటుంబంపై ఒంటికాలితో లేస్తున్నారు. దివంగత ఎర్రన్నాయుడుపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఏకంగా అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడ వెళ్లి కలబడ్డారు. సినిమా స్టైల్ లో వాహనం పైకి ఎక్కి మీసం మెలేసి తొడగొట్టారు. కింజరాపు కుటుంబంపై తిట్ల దండలం లఘించుకున్నారు. మరోసారి అధిష్టానం ద్రుష్టిలో పడి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. అప్పటి నుంచి కింజరాపు కుటుంబంపై అందివచ్చిన అన్ని వేదికలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు.
Also Read: Internet Cut In Konaseema: కోనసీమలో ఇంటర్నెట్ కట్.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల అవస్థలు అంతా ఇంతాకాదు..
సోమవారం వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మరోసారి అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. ‘‘చట్నీ నా కొడకా.. దిక్కుమాలిన దున్నుపోతు నా కొడకా.. నువ్వురా మాట్లాడుతావు.. నువ్వురా 160 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయంటావు.. నువ్వురా జగన్మోహన్‌రెడ్డి గురించి మాట్లాడుతావు.. పార్టీ లేదు.. బొక్కాలేదు.. అని లాడ్జీ గదుల్లో చెబుతా వు, లాడ్జీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోసం చేస్తావు. ఆ దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీకి, దొంగల పార్టీకి గతిలేక నిన్ను అధ్యక్షుడ్ని చేశారు.
ఇంకోసారి జగన్మోహన్‌రెడ్డిపై మాట్లాడితే.. నీ తాట తీస్తా జాగ్రత్త. ఒరేయ్ దున్నపోతా మాకు అధికారాలతో పనిలేదురా.. పదేళ్ల క్రితమే నిన్ను గుడ్డలూడదీసి కొడతానని హెచ్చరించారు. దువ్వాడ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీలోని ఓ వర్గం సైతం దువ్వాడ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని చెబుతున్నారు. అయితే దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా.. టెక్కలి నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో మైలేజీ రాకపోవడంతో ఆయనను పార్టీ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పిస్తారని టాక్ నడుస్తోంది. అందుకే ఆయన అచ్చెన్నపై విమర్శల జోరు పెంచారని వైసీపీలో ఓ వర్గం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read:KCR IAS Postings : కేసీఆర్ దగ్గర పదవులు ఎవరికిస్తారు? ఎందుకిస్తారో తెలుసా?.. రహస్యం బయటపడింది!