Pawan Kalyan Comments On Roja : ఏపీ వైసీపీ మంత్రి రోజా అవాకులు చెవాకులపై నిన్న నాగబాబు కౌంటర్ ఇస్తే.. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎన్ కౌంటర్ చేశాడు. జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన సినిమాటిక్ స్టైల్లో వేసిన సెటైర్స్ అదిరిపోయయానే చెప్పాలి.

గత కొద్ది రోజుల క్రితం వైసీపీ మంత్రి రోజా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ , మెగా బ్రదర్స్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు , మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా రోజా కామెంట్స్ పై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రోజాతో కలిసి 8 ఏళ్ళ పాటు జబర్దస్త్ ప్రోగ్రాం లో న్యాయనిర్ణేతగా పనిచేసిన నాగబాబు కూడా రోజా కి చాలా తీవ్ర స్థాయిలో కౌంటర్లు విసిరాడు..’రోజా నీది నోరా కుప్పతొట్టా..ముందు పర్యాటక శాఖమంత్రి గా అభివృద్ధి చేపట్టు..టూరిజం లో టాప్ 10 లో ఉండే మన రాష్ట్రం..నువ్వు వచ్చిన తర్వాత 18 వ స్థానం కి వెళ్ళిపోయింది’ అంటూ సెటైర్స్ వేసాడు..రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి సైతం రోజా కామెంట్స్ పై స్పందించాడు.
ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కూడా రోజా దిమ్మతిరిగిపోయే రేంజ్ కౌంటర్ ఇచ్చాడు..నేడు శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం లో ‘యువ శక్తి’ అనే భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసాడు..ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.. ఈ సభలో పవన్ కళ్యాణ్ రోజా చేస్తున్న కామెంట్స్ పై మాట్లాడుతూ ‘నేను రెండు చోట్ల ఓడిపోయానని మన డైమండ్ రాణి రోజా కూడా కామెంట్ చేస్తుంది.. తు.తూ నువ్వు కూడానా..ఛీ నా బ్రతుకుచెడ’ అంటూ రోజా పై పవన్ కళ్యాణ్ వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..
ఏమి మాట్లాడకపోతేనే నోరేసుకొని పవన్ కళ్యాణ్ మీద పడిపోయే రోజా, ఇప్పుడు ఈ కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.