Pawan Kalyan- TDP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగబోతోందన్నది ఎవ్వరు ఊహించని విధంగా మారింది.. ప్రస్తుతం రాజకీయాలు మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వైపే తిరుగుతున్నాయి..పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాల పైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

2019 ఎన్నికలలో కేవలం ఒక్క సీటుకి మాత్రమే పరిమితమైన జనసేన పార్టీ ఇప్పుడు ఇంత స్థాయిలో ఎదిగిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు..అంతే కాకుండా త్వరలోనే జనసేన పార్టీ.. తెలుగు దేశం పార్టీతో జతకట్టబోతుంది అనే వార్తలు కూడా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చేస్తోంది.. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీకి వెన్నులో వణుకు పుట్టడం ప్రారంభమైంది. టీడీపీ – జనసేన కలిస్తే వైసీపీ పార్టీ కి ఈసారి అధికారం పక్కా అని సర్వే లు కూడా తేల్చి చెప్పడంతో.. ఈ కలయిక ని ఎలా కట్టడి చేయాలనే అనే దానిపై వైసీపీ పార్టీ ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తోంది.
మరోపక్క టీడీపీ – జనసేన పొత్తు గురించి మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.. అదేమిటి అంటే ఈ పొత్తు జరగాలంటే జనసేన పార్టీ పెట్టిన మెయిన్ కండిషన్ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే ఈ పొత్తు ఉంటుందని..లేకపోతే సొంతంగానే పోటీ చేస్తామని తెగేసి చెప్పిందట జనసేన.
ఇక చంద్రబాబు నాయుడికి 2024 ఎన్నికలు చాలా కీలకం..ఈ ఎన్నికలలో వాళ్ళు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది..లేకపోతే టీడీపీ పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించడం కష్టం..చంద్రబాబు కి వయసు అయిపోతుంది..ఆయన పుత్రుడు లోకేష్ కి జనాల్లో చరిష్మా లేదు..ఇలాంటి సందర్భంలో పార్టీ నిలబడాలంటే జనసేన పార్టీతో కలిస్తే తప్ప నెగ్గుకురాలేని పరిస్థితి ఏర్పడింది.

మరో పక్క టీడీపీ , వైసీపీ నుంచి కొంతమంది బడా లీడర్లు జనసేన పార్టీ లోకి చేరడానికి పవన్ కళ్యాణ్ తో ఇది వరకే పలుమార్లు చర్చలు జరిపారు..సరైన సమయం చూసి వాళ్ళు జనసేన పార్టీ లోకి అడుగుపెడతారు..ఈ సమాచారం ఇరు పార్టీలకు కూడా ఉంది.
ఎటు చూసిన జనసేన పార్టీ గ్రాఫ్ వేరే లెవెల్ కి వెళ్లే విధంగానే ఉండడంతో వేరే దారిలేక జనసేన డిమాండ్ చేసే కండిషన్స్ ని ఒప్పుకునే పరిస్థితి లో టీడీపీ ఉన్నట్టు సమాచారం..పొత్తు ప్రతిపాదన లో చంద్రబాబు ఈ షరతు ని ఒప్పుకున్నట్టు..పార్టీ ముఖ్య నేతలతో చర్చించి మా నిర్ణయం తెలియచేస్తాము అని చంద్రబాబు నాయుడు గ చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్త..మరి ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో అతి త్వరలోనే తెలియనుంది.